Monday, November 23, 2026 06:32 PM
Monday, November 23, 2026 06:32 PM

బాలయ్య బాటలోనే మెగాస్టార్ చిరంజీవి..?

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులు ఇప్పుడు తమ పరిధిని వెండితెరకే పరిమితం చేయకుండా ఓటీటీ వేదికలపైనా సత్తా చాటుతున్నారు. గతంలో ఆహా ఓటీటీ వేదికగా నట సింహం నందమూరి బాలకృష్ణ.. అన్‌స్టాపబుల్ టాక్ షోతో సంచలన విజయం సాధించి, ఓటీటీ వ్యాఖ్యాతగా కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు సరిగ్గా బాలకృష్ణ బాటలోనే పయనిస్తూ, మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా తొలిసారిగా ఆయన ఒక సెలబ్రిటీ టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు.

Also Read : ఎక్స్‌ప్లోరర్ పెద్దపులి బోనుకు చిక్కుతుందా..? అసలేం జరుగుతుంది..?

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి మెగావర్స్ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ నగరవ్యాప్తంగా ‘CHIRA_JEEVI’ పేరుతో వెలసిన భారీ హోర్డింగులు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించగా, అది ఈ కొత్త టాక్ షో ప్రచారానికి సంబంధించినదేనని తెలుస్తోంది. నవంబర్ 30న హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానుల సమక్షంలో ఈ షోను అత్యంత ఘనంగా ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : ఏపీకి మరో రెండు, మూడు తుపానుల ముప్పు..?

బాలకృష్ణ తన షోలో అగ్ర హీరోలను పిలిచి ఆసక్తికర విషయాలు రాబట్టినట్లే, చిరంజీవి కూడా తన.. మెగావర్స్ షోలోకి ఇండస్ట్రీ దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని వంటి అగ్ర హీరోలతో పాటు బ్రహ్మానందం, సత్య ఈ షోలో సందడి చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రోమో విడుదల కానుండగా, బాలయ్య సృష్టించిన రికార్డులను మెగాస్టార్ ఏ స్థాయిలో అధిగమిస్తారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పులివెందుల చరిత్రలో కొత్త...

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

కార్యకర్తే కింగ్.. కర్నూలు...

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ..కష్టకాలంలో...

ఎక్స్‌ప్లోరర్ పెద్దపులి బోనుకు...

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు...

అంతర్గత ప్రజాస్వామ్యం.. బాగా...

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగానే నాయకులు...

ఏపీకి మరో రెండు,...

ఇటీవల సంభవించిన 'అర్నబ్', 'మురసు' తుపానుల...

రిలయన్స్ దూకుడు.. ఏడాదిలోనే..!

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్...

పోల్స్