Tuesday, November 17, 2026 11:01 AM
Tuesday, November 17, 2026 11:01 AM

జగన్ ఫేక్ ట్వీట్‌కు లోకేష్ దిమ్మతిరిగే ఫ్యాక్ట్ కౌంటర్..!

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై అధికార కూటమి ప్రభుత్వానికి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటన నేపథ్యంలో ఫీజు బకాయిలు చెల్లించడం లేదంటూ జగన్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా గణాంకాలతో కూడిన ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు. జగన్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ, “మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది” అంటూ అసలు వాస్తవాలను ప్రజల ముందుంచారు.

Also Read : కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల 20న తేదీన తాకనున్న తీవ్ర తుఫాను

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా గాలికొదిలేశారని నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. జగన్ తన బొమ్మల పిచ్చితో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సొంత ప్రచారానికి, పబ్లిసిటీకి మళ్లించారని ఆరోపించారు. ఫలితంగా 2024 జూన్ నాటికి ఉన్నత విద్యాశాఖలో దాదాపు రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పేరుకుపోయేలా చేసి వెళ్లారని లోకేష్ ఆధారాలతో సహా ఎండగట్టారు. బకాయిలు పెట్టి వెళ్లిన మీరే ఇప్పుడు ప్రభుత్వంపై బురద చల్లడం దుర్బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.

Also Read : శివలింగం పై బ్రహ్మ ముఖాలు.. చేబ్రోలులో ఎందుకిలా?

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ పేద విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకూడదనే చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన గడిచిన రెండున్నరేళ్ల కాలంలోనే దాదాపు రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం పెట్టిన పాత బకాయిలను తీరుస్తూనే, ప్రస్తుతం ప్రతినెలా క్రమపద్ధతిలో నిధులను నేరుగా కళాశాలల ఖాతాలకు జమ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ఇప్పటికే వేల కోట్ల నిధులు విడుదలయ్యాయని, మిగిలిన బకాయిలను కూడా దశలవారీగా పూర్తిగా చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్ల ఇబ్బందులు లేకుండా చేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

ఏపీ లిక్కర్ స్కామ్...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న...

మేయర్ కుర్చీ.. సీనియర్లకు...

ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల...

పోల్స్