Friday, November 6, 2026 08:25 PM
Friday, November 6, 2026 08:25 PM

టోయోటా ఇన్నోవా క్రిస్టా లిమో లాంచ్.. ధర ఎంత అంటే..?

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టోయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లోకి సరికొత్త ఇన్నోవా క్రిస్టా లిమో వేరియంట్‌ను విడుదల చేసింది. ప్రత్యేకంగా కమర్షియల్ మరియు ట్రావెల్ ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ సరికొత్త ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఇది కేవలం జిఎక్స్-ఎస్ఎల్ఎఫ్ గ్రేడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని టోయోటా పేర్కొంది. రెగ్యులర్ క్రిస్టా మోడల్స్ అయిన GX, VX, ZX వేరియంట్లతో పోలిస్తే ఇది మరింత అందుబాటు ధరలో ఉంటూ, ఫ్లీట్ ఆపరేటర్లకు ప్రీమియం ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

Also Read : నార్త్ మార్కెట్ లోనూ ప్రభాస్ దే డామినేషన్..!

ఈ సరికొత్త ఇన్నోవా క్రిస్టా లిమో వేరియంట్ 7-సీటర్, మరియు 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలను పరిశీలిస్తే 7-సీటర్ ధర రూ. 19.95 లక్షలుగా ఉండగా, 8-సీటర్ ధర రూ. 19.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ మోడల్‌లోని 7-సీటర్ వెర్షన్‌లో మిడిల్ రో లో ప్రత్యేకమైన క్యాప్టెన్ సీట్లు లభిస్తాయి. అలాగే ప్రయాణికులకు మంచి హెడ్‌రూమ్, లెగ్‌రూమ్‌తో పాటు అన్ని వరుసలకు ఏసీ వెంట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. లాంగ్ జర్నీలలో ప్రయాణికులు అలసిపోకుండా ఉండేలా సీట్ల కంఫర్ట్‌పై కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

Also Read : అనంతపురంలో ఏం జరుగుతోంది.. బాబు ఫైర్..!

టెక్నాలజీ విషయానికి వస్తే.. ఈ లిమో వేరియంట్‌లో పాత నమ్మకమైన 2.4-లీటర్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. ఈ ఇంజన్ లీటరుకు గరిష్టంగా 15 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ వెల్లడించింది. దీనితో పాటు 3 ఏళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని, అలాగే అదనపు రక్షణ కోసం 5 ఏళ్లు లేదా 2,20,000 కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆప్షన్‌ను కూడా కస్టమర్లకు అందిస్తున్నారు. వీటికి తోడు 7 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్న ఫైనాన్సింగ్ స్కీమ్‌లు, తక్కువ ఈఎంఐ ప్లాన్‌లు, 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా టోయోటా కల్పిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

అనంతపురంలో ఏం జరుగుతోంది.....

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం...

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

పోల్స్