Friday, November 6, 2026 07:26 PM
Friday, November 6, 2026 07:26 PM

విరాట్ కోహ్లీ డొమెస్టిక్ రీఎంట్రీ.. ఢిల్లీ కోచ్ సంచలన కామెంట్స్..!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మళ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందిగా, ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ జట్టు కోచ్ విజయ్ దహియా కోరారు. రోహిత్ శర్మ ఇప్పటికే రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడేందుకు ఆసక్తి చూపించగా, కోహ్లీ కూడా అదే బాటలో పయనిస్తే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డేలకు మాత్రమే పరిమితం కావడంతో, 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ ప్రాక్టీస్ కోసం డొమెస్టిక్ వన్డే టోర్నీ ఆడటం మంచి మార్గమని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.

Also Read : గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.. అప్పిరెడ్డికి షాక్ ఇచ్చిన పోలీసులు..!

ఈ నేపథ్యంలో ఢిల్లీ హెడ్ కోచ్ విజయ్ దహియా మాట్లాడుతూ, కోహ్లీ జట్టులోకి వస్తే మ్యాచ్‌లు ఆడకపోయినా సరే, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి యువ ఆటగాళ్లకు దిశా నిర్దేశం చేసేలా చూస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. “కోహ్లీ గనుక ఢిల్లీ జట్టులోకి వస్తే నేను అస్సలు ఇంటికి వెళ్లనివ్వను. డ్రెస్సింగ్ రూమ్‌లోనే కూర్చోబెట్టి, ఆయన క్రికెట్ జర్నీ, పడ్డ కష్టం, వర్క్ ఎథిక్స్ మరియు దేశానికి ఆడటంలో ఉండే గౌరవం గురించి కుర్రాళ్లకు వివరించమని చెబుతాను” అని దహియా పేర్కొన్నారు. కోహ్లీ చిన్న స్థాయి నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన విధానం యువ క్రికెటర్లకు ఒక గొప్ప మార్గదర్శకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read : అనంతపురంలో ఏం జరుగుతోంది.. బాబు ఫైర్..!

గత సీజన్‌లో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి రెండు అర్ధసెంచరీలతో రాణించాడు. కాగా, 2026-27 విజయ్ హజారే ట్రోఫీ సీజన్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ 74 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మరి ఢిల్లీ కోచ్ కోరిక మేరకు కోహ్లీ ఈసారి డొమెస్టిక్ బరిలోకి దిగుతాడో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

అనంతపురంలో ఏం జరుగుతోంది.....

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం...

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

గుంటూరులో అర్ధరాత్రి హైడ్రామా.....

గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద స్థానిక...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

పోల్స్