గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్న భారీ అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున నల్లధనం చేతులు మారిందనే ఆధారాలతో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం ఏడు కీలక ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు.
Also Read : కూటమి క్లీన్ స్వీప్.. మరీ ఇలా చేస్తారా..?
ఈ కేసులో ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన నివాసంతో పాటు, ఈ అక్రమ వాల్యుయేషన్ ప్రక్రియలో భాగస్వామ్యముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ డిజిటల్ సంస్థల ప్రతినిధుల ఇళ్లలో కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా క్యామ్‌సైన్ మీడియా, ఇతర ప్రైవేట్ ఏజెన్సీలకు నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల నిధులు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
Also Read : మావిగన్ ఫలితాలు.. మడత పెట్టాయి కదా..!
ఈ సంస్థల ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వివాదం 2018 నాటి 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు సంబంధించింది. 2020 డిసెంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షల అనంతరం, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే నిర్ధారించింది. మంగళగిరి సమీపంలోని ఒక రిసార్ట్‌లో దాదాపు 84 రోజుల పాటు జవాబు పత్రాలను ఉంచి అత్యంత రకస్యంగా మాన్యువల్ మూల్యాంకనం జరిపినట్లు తేలింది. ఈ ప్రక్రియలో కనీస అర్హత లేని సుమారు 66 మంది ప్రైవేట్ వ్యక్తులతో గ్రూప్-1 ఓఎంఆర్ జవాబు పత్రాలను దిద్దించారని, ఫలితాల డేటాబేస్‌ను కూడా తారుమారు చేశారని సిట్, ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలతో నిరూపించాయి. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగి సోదాలు నిర్వహించడం ఏపీ అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.


