ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వాతావరణం పెద్ద అడ్డంకిగా మారింది. మున్సిపల్ ఎన్నికల ముగిసిన వెంటనే షెడ్యూల్ ప్రకారం గురువారం జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసరంగా రంగంలోకి దిగింది. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని తాజా పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Also Read : కూటమి క్లీన్ స్వీప్.. మరీ ఇలా చేస్తారా..?
ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల పరిస్థితి ఎలా ఉంది..? ఓటర్లు, సిబ్బంది రాకపోకలకు ఏమైనా ఆటంకాలు ఉన్నాయా..? అనే అంశాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారుల నుంచి ఎస్‌ఈసీ నివేదికలు కోరింది. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రవాణా సౌకర్యాలు దెబ్బతినడం వంటి కారణాలతో పోలింగ్ నిర్వహణ కష్టతరంగా మారినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే.
Also Read : బొత్స వారసురాలికి షాక్ తప్పదా..?
భారీ వర్షాలు, వరద ముప్పు పొంచి ఉన్న కొన్ని నిర్దిష్ట తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించిన జిల్లాల్లో యథావిధిగా పోలింగ్ జరిపి, తీవ్రంగా నష్టపోయిన చోట్ల మాత్రం పోస్ట్‌పోన్ చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎస్‌ఈసీ తీసుకోబోయే అధికారిక నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముగించుకుని పోలింగ్‌కు సిద్ధమైన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం ఇచ్చే తుది ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


