Tuesday, November 3, 2026 04:30 PM
Tuesday, November 3, 2026 04:30 PM

కూటమి క్లీన్ స్వీప్.. మరీ ఇలా చేస్తారా..?

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్లే ఉన్నాయి. వార్ వన్ సైడ్ అనే మాట ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందు నుంచే వినిపిస్తోంది. అయితే.. “గట్టి పోటీ ఇస్తాం.. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం.. ఈవీఎం కాదు.. బ్యాలెట్‌లో సత్తా చాటుతాం.. మేము గెలిచి చూపిస్తాం..” అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన మహానుభావులు.. ఇప్పుడు అభాసుపాలవుతున్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓ వైపు మురసు తుఫాన్ ఏపీలోని కోస్తా తీరంపై విరుచుకుపడుతుంటే.. మరోవైపు కూటమి పార్టీలకు అనుకూలంగా ఓటర్లు ఓట్లతో జవాబిచ్చారు.

Also Read : పులివెందుల కోట బద్దలు కొట్టిన కూటమి..?

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తుంది. అలాగే ఈ సారి కూడా 80 శాతం సీట్లు కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు గెలుచుకుంటారని అంతా అనుకున్నారు. కానీ.. ఫలితాలు వెలువడిన తర్వాతే అసలు సంగతి బయటకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. వైసీపీకి కనీసం చెప్పుకోదగిన స్థానాలు కూడా రాలేదు. అక్కడొకటి అక్కడొకటి అంటూ ఒకటి రెండు వార్డుల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అది కూడా వంద లోపు ఓట్ల మెజారిటీతోనే. ధర్మవరంలో అయితే కేవలం ఒక్క ఓటుతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. అయితే.. బీజేపీ అభ్యర్థి రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు.

మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు రావడం మొదలైన వెంటనే.. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇంటి బాట పట్టారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లోనే వైసీపీ పరిస్థితి తేలిపోయింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలపైన ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త అసహనం, వ్యతిరేకత ఉంటుంది. ఆ కోపాన్ని పోస్టల్ బ్యాలెట్ రూపంలో స్పష్టంగా చూపిస్తారు. కానీ.. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా నిలిచారు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతం రావడం అంటున్నారు. అన్ని మునిసిపల్, కార్పొరేషన్ల పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు కూటమికే ఆధిక్యత వచ్చింది. కనీసం ఒక్క చోట కూడా వైసీపీకి మెజారిటీ రాలేదు.

Also Read : బ్రేకింగ్: బెజవాడకు వరద ముప్పు.. అధికారుల అలెర్ట్..!

ఇక కొవ్వూరు, మార్కాపురం వంటి మునిసిపాలిటీల్లో కనీసం ఒక్క వార్డు కూడా వైసీపీ అభ్యర్థులు గెలవలేదు. ఇదే పరిస్థితి దాదాపు చాలా మునిసిపాలిటీల్లో కనిపిస్తోంది. వినుకొండలో అయితే 18 వార్డుల కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి కేవలం ఒక్కటే గెలుచుకున్నారు వైసీపీ నేతలు. ఇక చైర్మన్ అభ్యర్థుల కౌంటింగ్ అయితే వార్ వన్ సైడ్ అనే మాట కరెక్ట్‌గా సరిపోతుంది. కనీసం ఒక్క మునిసిపల్ చైర్మన్ సీటు కూడా వైసీపీకి దక్కలేదు. 2021లో వైసీపీ నేతలు ఎన్ని దాడులు చేసినా.. ఎన్ని అరాచకాలు చేసినా.. ఎంత బెదిరించినా సరే.. తాడిపత్రి సహా కొన్ని మునిసిపాలిటీలు టీడీపీ ఖాతాలో చేరాయి. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలు కోరుకున్నట్లుగా జరిగిన బ్యాలెట్ ఓటింగ్‌లో.. కనీసం ఒక్క చోటు కూడా వైసీపీ అభ్యర్థికి.. ఒక్క రౌండ్‌లో కూడా మెజారిటీ రాలేదు. ఓటర్లు కూటమికి పట్టం కట్టారనే మాట కంటే కూడా.. వైసీపీని మడతెట్టేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మావిగన్ ఫలితాలు.. మడత...

అనుకున్నంత అయ్యింది.. మునిసిపల్ ఫలితాలు వెలువడ్డాయి....

పాతికేళ్ళ తర్వాత మాచెర్ల...

పల్నాడు జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మాచర్ల...

పులివెందుల కోట బద్దలు...

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన,...

బ్రేకింగ్: బెజవాడకు వరద...

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం...

సీఎం చంద్రబాబుకు అమిత్...

ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుపాన్లు వణికిస్తున్న నేపథ్యంలో...

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో...

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ కార్పొరేషన్...

పోల్స్