Thursday, October 29, 2026 07:17 PM
Thursday, October 29, 2026 07:17 PM

చంద్రబాబు విజన్‌పై కేటీఆర్ ప్రశంసలు..!

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ఊహించని సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటిఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీటి నిర్వహణ సహా ముందస్తు ప్రణాళికలపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై స్పందిస్తూ.. పొరుగున ఉన్న ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఇక్కడ కరువు తాండవిస్తోందని, కానీ ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read : బ్యాలెట్ పద్ధతిలోనూ కాంగ్రెస్ కు కష్టాలు..!

తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు గానీ, రైతులకు క్రాప్ హాలిడే గానీ ప్రకటించాల్సిన అవసరం రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. దీనికంతటికీ చంద్రబాబు నాయుడు ముందుచూపే ప్రధాన కారణమని కొనియాడారు. “చంద్రబాబు నాయుడు తన విజన్‌తో, ముందస్తు ప్రణాళికలతో నీళ్లను ఎత్తిపోసుకున్నారు. సముద్రంలో వృధాగా పోయే నీటిని పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా ఒడిసిపట్టి రైతుల అవసరాలకు మళ్లించారు. అందుకే అక్కడ వ్యవసాయం పచ్చగా ఉంది, ఈ విషయంలో నేను ఏపీ సీఎం చంద్రబాబును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు సీరియస్..!

ఇదే సమయంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో లేని కరువు కేవలం తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉండి రైతులు అల్లాడుతుంటే.. ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోకుండా మూసీ నది సుందరీకరణ పేరుతో రూ.1.50 లక్షల కోట్లు లూటీ చేయడానికి సిద్ధమైందని ఆరోపించారు. కరువును మేనేజ్ చేయడంలో ఏపీ ప్రభుత్వం చూపించిన సమర్థతను చూసైనా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక...

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి...

పింఛన్లను అడ్డుకునేందుకు వైసీపీ...

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1వ తేదీన జరగబోయే...

కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగబోయే పట్టణ,...

బయట అర్నాబ్ బీభత్సం.....

రాష్ట్రం అర్నాబ్ తుఫాన్ ముప్పుతో వణికిపోతోంది....

కరువు ముప్పు.. కదిలిన...

ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో...

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

ఉత్తరప్రదేశ్ తమ కంచుకోట అనుకున్న బిజెపికి...

పోల్స్