Thursday, October 29, 2026 01:20 PM
Thursday, October 29, 2026 01:20 PM

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్..!

ఉత్తరప్రదేశ్ తమ కంచుకోట అనుకున్న బిజెపికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ గెలవకపోయినా ఎస్పీ మాత్రం చుక్కలు చూపించింది. 11 పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఊహించని విధంగా పుంజుకుని బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది.

Also Read : అర్నబ్ వెనుకాలే ఏపీకి కొత్త తుఫాన్ ముప్పు..?

ఈ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్నో గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు ఆగ్రా టీచర్స్ నియోజకవర్గాన్ని సైతం సమాజ్‌వాదీ పార్టీ కైవసం చేసుకుంది. లక్నో గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి అవనీష్ కుమార్ సింగ్‌ను ఎస్పీ అభ్యర్థి కాంతి సింగ్ పటేల్ ఓడించారు. అలాగే అలహాబాద్-ఝాన్సీ గ్రాడ్యుయేట్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి మాన్ సింగ్ యాదవ్, వారణాసి టీచర్స్ స్థానంలో లాల్ బిహారీ యాదవ్ భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించి బీజేపీ కోటలను బద్దలు కొట్టారు.

Also Read : రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టైంలో మొబైల్ చార్జింగ్ బంద్..!

ఈ ఫలితాల అనంతరం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బతో యూపీలో బీజేపీ లగేజ్ ప్యాక్ అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, సీఎం యోగి నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లలో ఫలితాలను తారుమారు చేసేందుకు బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు లాంటి విద్యావంతులు యోగి ప్రభుత్వ వ్యతిరేకతను ఈ ఓట్ల రూపంలో చూపించారని, ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయే మార్పుకు పక్కా సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కరువు ముప్పు.. కదిలిన...

ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో...

ఇరాన్‌పై దాడికి అమెరికా...

ప్రపంచవ్యాప్తంగా దాదాపు గత ఏడాది కాలంగా...

బ్యాలెట్ పద్ధతిలోనూ కాంగ్రెస్...

దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన...

అర్నబ్ వెనుకాలే ఏపీకి...

తీర ప్రాంత ప్రజలు తీవ్ర తుఫాన్...

ఇంకా ఎంత కాలం...

మళ్లీ మళ్లీ అదే ఏడుపు.. ఇది...

బాబోయ్.. అక్టోబర్ నెల...

అక్టోబర్ నెల అంటే చాలు.. ఆంధ్రప్రదేశ్...

పోల్స్