Tuesday, October 27, 2026 02:50 PM
Tuesday, October 27, 2026 02:50 PM

బెంగళూరు ప్యాలెస్‌లో సజ్జల, అవినాష్‌లపై జగన్ చిందులు..?

వైఎస్ఆర్ కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కవచం. అలాంటి కడప జిల్లాలో తాజా మున్సిపల్ ఎన్నికల పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులను కదిలించివేసాయి. కడప మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేల్, కమలాపురం, మైదుకూరు, రాజంపేట వంటి ఆరు కీలక మున్సిపాలిటీలను తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి పూర్తిగా ఏకగ్రీవం చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

Also Read : మళ్లీ.. బొత్స వర్సెస్ కిమిడి..!

జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీలో సైతం పరిస్థితి అనుకూలంగా లేకపోవడం, కడప కార్పొరేషన్ లో నామినేషన్ లు వేసేందుకు నేతలు ముందుకు రాకపోవడం.. రాజంపేట వంటి స్థానాలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుని వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టడం జగన్ మోహన్ రెడ్డికి అస్సలు జీర్ణించుకోలేని పరిణామం గా మారింది. సొంత కోటలోనే పార్టీ ఈ స్థాయిలో ఘోర పరాజయం పాలుకావడం, కేడర్ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేకపోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురైనట్లు పార్టీ అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం బెంగళూరులోని తన ప్రధాన నివాసమైన యెలహంక ప్యాలెస్ నుంచి తన పార్టీని నడుపుతున్న జగన్.. కడప ఏకగ్రీవాల విషయం వెలువడిన వెంటనే అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు జిల్లాలో ఏం జరుగుతోంది..? కూటమి అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటుంటే స్థానిక నేతలు, ఇన్ఛార్జులు ఏం చేస్తున్నారంటూ సజ్జల, అవినాష్ రెడ్డిలను జగన్ నిలదీసినట్లు సమాచారం.

Also Read : 100% ఇథనాల్ కేంద్రం సంచలన నిర్ణయం..!

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. కడప జిల్లాలో వైసీపీ పతనం కావడానికి నాయకత్వ లోపం, కేడర్ లో నెలకొన్న నైరాశ్యమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించకుండా కేవలం హెడ్ ఆఫీస్ వ్యూహాలకే పరిమితం కావడం, మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి సొంత జిల్లా రాజకీయాలపై పట్టు కోల్పోవడం వల్లనే ఈ ఘోర పరాభవం ఎదురైందని విశ్లేషిస్తున్నారు. పులివెందుల, కడప లాంటి ప్రాంతాల్లో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు కనీసం నామినేషన్లు వేయడానికి కూడా ముందుకు రాకపోవడం వెనుక స్థానిక నాయకత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్లీన్ స్వీప్ ఫలితాల అనంతరం, కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే ట్యాగ్‌ను కూటమి విజయవంతంగా చెరిపేయగలిగింది. ఈ సంక్షోభం నుండి వైసీపీ కేడర్‌ను జగన్ మళ్లీ ఎలా యాక్టివ్ చేస్తారు, రాబోయే రోజుల్లో కడప రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఒంగోలు పార్లమెంట్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఒంగోలు...

అంతా అయిపోయింది అన్న.....

చేతులు కాలిన తర్వాత.. ఆకులు పట్టుకున్నట్లుగా...

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఏం...

ప్రశాంతంగా హైదరాబాద్ నగరం సేద నిద్రపోతున్న...

ఇళ్లు, ఆస్తులు అన్నీ...

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత...

క్లీన్ ఎనర్జీ క్యాపిటల్‌గా...

ఏపీలో క్లీన్ ఎనర్జీ అభివృద్ధి లక్ష్యంగా...

డిసెంబర్‌ 4న ఏపీకి...

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద...

పోల్స్