Wednesday, October 7, 2026 04:15 AM
Wednesday, October 7, 2026 04:15 AM

ఈరోజు రాశి ఫలితాలు (06-10-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళ పక్షం.. 06-10-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనవ్యవహారాలు కలసివస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
—————————————

వృషభం

వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృ వర్గీయుల నుండి ధన సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.
—————————————

మిధునం

దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటాబయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు.
—————————————

కర్కాటకం

ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.
—————————————

సింహం

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు మందకోడిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.
—————————————

కన్య

విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం శ్రేయస్కరం.
—————————————

తుల

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. భూ, క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
—————————————

వృశ్చికం

నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులతో భూవివాదాలు తీరి ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.
—————————————

ధనస్సు

ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
—————————————

మకరం

నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజి అవుతాయి.
—————————————

కుంభం

వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకొంటారు.
—————————————

మీనం

కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంబంధించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్