Monday, September 21, 2026 07:50 PM
Monday, September 21, 2026 07:50 PM

ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు..?

హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకవేళ ఉపఎన్నిక అనివార్యమైతే, అక్కడ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి రానున్నాయి. ఈ స్థానం నుంచి ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలనే దానిపై గులాబీ పార్టీ అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌ను ఖైరతాబాద్ బరిలో నిలపాలని తండ్రి గట్టి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న రవి ప్రకాష్..?

గత 2018, 2023 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున దానం నాగేందర్ ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో స్థానిక క్యాడర్ మరియు లీడర్లు ఆయనకు బాగా అలవాటు పడ్డారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆయన పార్టీ మారినప్పటి నుంచి ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం గులాబీ బాస్ అన్వేషిస్తున్నారు.

Also Read : వైసీపీ నేతలపై క్రిమినల్ కేసు.. సర్కార్ కీలక నిర్ణయం..!

సాయికిరణ్‌కు గనుక ఖైరతాబాద్ టికెట్ ఇస్తే, ఎన్నికల బాధ్యతలన్నింటినీ తానే దగ్గరుండి చూసుకుంటానని, ఆర్థికంగా, రాజకీయంగా అన్నీ తానై నడిపిస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. బలమైన సామాజికవర్గ సమీకరణాలు, తండ్రికున్న రాజకీయ బలం సాయికిరణ్‌కు ప్లస్ అవుతాయని గులాబీ అగ్రనేతలు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, సాయికిరణ్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకుడు మన్నె గోవర్ధన్ రెడ్డి, అలాగే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్లను కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. ఏదేమైనా ఉపఎన్నిక వస్తే మాత్రం ఖైరతాబాద్ గులాబీ టికెట్ రేసులో తలసాని తనయుడి పేరే ప్రధానంగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

వైసీపీ నేతలపై క్రిమినల్...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ...

ఎర్రవల్లిలో ఊపందుకున్న భూముల...

మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్...

నాతో వస్తావా.. నీకు...

అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో వ్యాపారం చేయాలనుకున్న...

టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ...

తెలుగు మీడియా రంగంలో అత్యంత ప్రజాదరణ...

SAAP ఆఫీస్ వద్ద...

విజయవాడ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు...

పోల్స్