Monday, September 21, 2026 04:06 PM
Monday, September 21, 2026 04:06 PM

టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న రవి ప్రకాష్..?

తెలుగు మీడియా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన న్యూస్ ఛానల్‌లో ఊహించని భారీ మార్పులు జరగబోతున్నాయనే ప్రచారం ఇప్పుడు ఫిలింనగర్, పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఛానల్ యాజమాన్యం ఎడిటోరియల్ విభాగంలో ప్రక్షాళన మొదలైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీవీ9 వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రవి ప్రకాష్ మళ్ళీ ఈ సంస్థలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త మీడియా వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

Also Read : సౌదీకి హౌతీల దెబ్బ.. వణుకుతున్న అమెరికా..!

ఈ తాజా ఊహాగానాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత అధికార పార్టీ చేతికి టీవీ9 సంస్థ యాజమాన్య బాధ్యతలు వెళ్లే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ఛానల్ ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి అనుకూలంగా ఉందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, కొత్త మేనేజ్‌మెంట్ ఛానల్ ఇమేజ్‌ను పూర్తిగా మార్చాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ కాలంలో చేరిన బీఆర్ఎస్ అనుకూల టీమ్‌ను మరియు కీలక స్థానాల్లో ఉన్న కొందరు ప్రతినిధులను పూర్తిగా బయటకు పంపే యోచనలో ప్రస్తుత యాజమాన్యం ఉన్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది.

Also Read : సాప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. టీచర్లపై వైసీపీ దాడి..!

ఛానల్‌కు పాత వైభవాన్ని తీసుకురావడంతో పాటు సరికొత్త పంథాలో ప్రజల ముందుకు వెళ్లేందుకు ఒక సరికొత్త లోగోను కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా, టీవీ9ను మొదటి నుంచి నడిపించిన అనుభవజ్ఞుడైన రవి ప్రకాష్ చేతికే మళ్లీ ఎడిటోరియల్ పూర్తి బాధ్యతలను అప్పగించబోతున్నారనే లీకులు అందుతున్నాయి. రవి ప్రకాష్ మార్క్ జర్నలిజంతో ఛానల్‌ను రీ-లాంచ్ చేసి రేటింగ్‌లలో సరికొత్త రికార్డులు సృష్టించాలని సరికొత్త ప్లాన్ వేసినట్లు టాక్. ఈ వార్తలపై టీవీ9 యాజమాన్యం లేదా రవి ప్రకాష్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ ఇండస్ట్రీ టాక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాతో వస్తావా.. నీకు...

అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో వ్యాపారం చేయాలనుకున్న...

SAAP ఆఫీస్ వద్ద...

విజయవాడ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు...

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

పోల్స్