Friday, September 11, 2026 05:22 PM
Friday, September 11, 2026 05:22 PM

చిత్ర విచిత్రంగా బీజీపీ డిమాండ్లు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అప్పుడెప్పుడో నిద్రపోయి, కుంభకర్ణుడు కూడా సిగ్గుపడేలా గాఢ నిద్రలో ఉన్న కమలనాథులకు ఎట్టకేలకు జ్ఞానోదయం అయిందట..! హమ్మయ్య, ఎట్టకేలకు బీజేపీ నేతలు నిద్రలేచారంటూ రాజకీయ పరిశీలకులు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకాలం ‘మేం ఉ న్నామా.. లేమా..?’ అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్న ఆ పార్టీ హైకమాండ్, సడన్‌గా ఢిల్లీ నుంచి ఒక్క ‘డెరెక్షన్’ ఇవ్వడమే తరువాయి.. ఏపీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ నెల చివరి వారంలో స్థానిక ఎన్నికల మోత మోగబోతుందనే సరికి, ఇన్నాళ్లు కలలో కూడా లేని బీజేపీ పెద్దలకు ఇప్పుడు ఏపీ స్థానిక సంస్థలు గుర్తుకొచ్చేశాయి. దీంతో, ‘మాకు ఆ సీటు కావాలి, ఈ పీఠం కావాలి’ అంటూ ఏకంగా ఢిల్లీ నుంచే ఆర్డర్లు జారీ చేసేస్తున్నారు.

Also Read : చిన్న శ్రీను ఎఫెక్ట్.. బొత్స సైలెన్స్..!

నిజానికి, ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ, జనసేన ఒకరి తర్వాత ఒకరు చక్రం తిప్పుకుంటూ ఉంటే.. బీజేపీ మాత్రం ఎక్కడో సైలెంట్‌గా కూర్చుని చూస్తున్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలొచ్చేసరికి ఆ పార్టీకి ఉన్నట్లుండి జోష్ వచ్చేసింది. మనం కూడా లైన్‌లో ఉన్నాం.. అనిపించేలా హడావుడి మొదలుపెట్టారు. ఢిల్లీ పెద్దలే స్వయంగా రంగంలోకి దిగి.. రాష్ట్రంలో మన పార్టీ జెండా ఎగరాలంటే కింద స్థాయి నుంచి బలపడాలి. అందుకని పది మున్సిపాలిటీలు, మూడు జెడ్సీలు, ముఖ్యమైన మేయర్ సీట్లు అడగాలంటూ మన రాష్ట్ర నాయకులకు అక్షింతలు వేసి మరీ క్లాస్ తీసుకున్నారట. దీంతో ఇన్నాళ్లు చప్పగా ఉన్న కమలనాథులలో ఒక్కసారిగా రంగంలోకి దిగారు.

అసలు కథ ఇక్కడే మొదలైంది. బీజేపీ నేతలు ఎంచుకున్న టార్గెట్లు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు లాంటి క్రేజీ కార్పొరేషన్ల మేయర్ పీఠాల మీద కన్నేశారు. విశాఖ విషయంలో.. వాళ్లు చెప్పే లాజిక్ వింతగా ఉంది. ‘అప్పట్లో 1979లో, అంటే ఎప్పుడో కాంగ్రెస్‌తో పోటీ పడి మరీ జనసంఘ్ రూపంలో విశాఖ మేయర్ సీటు గెలుచుకున్నాం.. పైగా 2014 ఎంపీ మావాడే.. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ మనోడే, విశాఖలో ఎమ్మెల్యే మనోడే.. కాబట్టి విశాఖ మేయర్ పీఠం మాకే ఇవ్వాలి’ అంటూ గట్టిగా పట్టు పట్టారట. అప్పట్లో ఎప్పుడో సాధించిన దాన్ని పట్టుకుని, ఇప్పుడు మళ్లీ ఆ చరిత్రను రిపీట్ చేస్తామంటే. కాలం మారిపోయింది అని మిగతా కూటమి నేతలు చెబుతున్నారు.

ఇక విజయవాడ మీద కూడా కన్నేసింది కమలం. అక్కడ పశ్చిమ ఎమ్మెల్యే సీటు తమ వద్ద ఉంది కాబట్టి, బెజవాడ మేయర్ పీఠం కూడా తమకే కావాలని అడుగుతున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదే విజయవాడ మేయర్ సీటు కోసం జనసేన పార్టీ నేతలు కూడా గట్టిగానే పట్టుబడుతున్నారు. విజయవాడ పశ్చిమ సీటు త్యాగం చేశాం కాబట్టి.. మేయర్ మాకు ఇవ్వాలంటున్నారు జన సైనికులు. బీజేపీ నేతలు తమ పాత రికార్డులను తీసి టేబుల్ మీద పెడుతున్నారు. కూటమిలో ఉంటూనే తమ్ముళ సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తుంటే.. ప్రత్యర్థులతో పని లేకుండా వీళ్లే ఒకరికొకరు పోటీ పడేలా ఉన్నారని సెటైర్లు పేలుతున్నాయి.

ఇక తిరుపతి మేయర్ స్థానం మీద కూడా కన్నేసి, అక్కడ కూడా కాషాయ జెండా పాతేస్తామంటున్నారు. కార్పొరేషన్లతో ఆగితే ఎలా అనుకున్నారో ఏమో గానీ, కనీసం మూడు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలు, పదికి తగ్గకుండా మున్సిపాలిటీలు తమకే కట్టబెట్టాలని ఒక భారీ లిస్ట్ తయారుచేసి మిత్రపక్షాల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లుగా గ్రౌండ్ లెవెల్‌లో కేదర్ బలం ఎంత ఉందనేది పక్కన పెడితే.. డిమాండ్లు మాత్రం ఏకంగా మేయర్, చైర్మన్ సీట్లకే ఇస్తుండటం చూసి టీడీపీ అధిష్టానం కూడా కాస్త ఇరుకున పడినట్లు తెలుస్తోంది.

Also Read : ఎన్నికల బరిలో దూకుడు పెంచిన షర్మిల..!

మొత్తానికి చూస్తే, స్థానిక ఎన్నికల వేళ బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడలు, ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాలు చూస్తుంటే.. కమలనాథులు నిజంగానే నిద్రలేచారా లేక ఎన్నికలొచ్చాయి కాబట్టి కాసేపు అలా హడావుడి చేస్తున్నారా.. అనేది ఆసక్తికరంగా మారింది. మిత్రధర్మం పేరుతో వీరికి అన్ని సీట్లు ఇస్తారా..? లేక సైలెంట్‌గా సైడ్ చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, స్థానిక ఎన్నికల వేదికపై ఈ ‘కమల విలాసాలు’ మాత్రం ఏపీ రాజకీయాల్లో రసకందాయాన్ని పంచుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎన్టీఆర్ భరోసాకు సెలవుల...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన...

మహేష్ బాబు, రాజమౌళికి...

హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా...

కొబ్బరి నీళ్లలో సైనైడ్...

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన...

రేవంత్ ప్లాన్.. బీఆర్ఎస్...

అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి...

మంగళగిరిలో సంచలనం.. కేవలం...

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త...

బొల్లారం ఆర్మీ ఆయుధాలు...

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ పరిధిలో గల...

పోల్స్