Wednesday, September 23, 2026 12:51 AM
Wednesday, September 23, 2026 12:51 AM

సచిన్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే మైండ్ బ్లాక్..!

భారత క్రికెట్ చరిత్రలోనే కాదు, ప్రపంచ క్రీడా రంగంలోనే అత్యంత అరుదైన రికార్డును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు గడుస్తున్నప్పటికీ, బ్రాండ్ మార్కెట్‌లో ఆయన హవా ఏమాత్రం తగ్గలేదు. తాజా క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం.. సచిన్ టెండూల్కర్ ఏకంగా 125.9 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ. 1,189 కోట్లు బ్రాండ్ వాల్యూతో భారత్ లో టాప్-5 సెలబ్రిటీల జాబితాలో నిలిచాడు. విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ వంటి సమకాలీన యాక్టివ్ క్రికెటర్ల హవా నడుస్తున్న తరుణంలో, ఒక రిటైర్డ్ అథ్లెట్ ఈ స్థాయి బ్రాండ్ వాల్యూను కలిగి ఉండటం విశేషం.

Also Read : మోసాద్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఇరాన్.. గేమ్స్ కు చెక్..!

ప్రస్తుతం క్రీడల నుండి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, దేశంలోని అత్యంత ప్రభావవంతమైన టాప్-10 సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాలో నిలకడగా చోటు సంపాదించుకుంటున్న ఏకైక రిటైర్డ్ క్రీడాకారుడు సచినే కావడం గమనార్హం. మార్కెట్‌లో ఆయనకు ఉన్న తిరుగులేని క్రెడిబిలిటీ, ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వసనీయత కారణంగానే ఇప్పటికీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లు ఆయనను తమ అంబాసిడర్‌గా ఎంచుకోవడానికి పోటీ పడుతున్నాయి. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా ఏటా ఆయన బ్రాండ్ వాల్యూ నిరంతరాయంగా పెరుగుతూనే వస్తోంది.

Also Read : బెజవాడ మేయర్ పీఠంపై బొండా ఉమా కన్ను..?

తన సుదీర్ఘ 22 ఏళ్లకు పైగా సాగిన అంతర్జాతీయ కెరీర్‌లో 34,357 పరుగులు, టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలతో క్రీడా ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండూల్కర్.. మైదానం వెలుపల కూడా గాడ్ ఆఫ్ క్రికెట్ గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ పడిపోతుందనే అంచనాలను తలకిందులు చేస్తూ, సచిన్ సృష్టిస్తున్న ఈ సరికొత్త రికార్డులు మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. సమకాలీన క్రికెట్ స్టార్ల పోటీని తట్టుకుని సచిన్ టెండూల్కర్ బ్రాండ్ వాల్యూలో టాప్ పొజిషన్‌లో దూసుకుపోవడం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని...

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా...

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

పోల్స్