Wednesday, August 5, 2026 06:32 AM
Wednesday, August 5, 2026 06:32 AM

ఈరోజు రాశి ఫలితాలు (05-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాడ మాసం, బహుళ పక్షం.. 05-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

—————————————

వృషభం

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

—————————————

మిధునం

దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

—————————————

కర్కాటకం

రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

—————————————

సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

—————————————

కన్య

వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

—————————————

తుల

నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

—————————————

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి.

—————————————

ధనస్సు

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు.

—————————————

మకరం

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరో బాధను కలిగిస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి వలన నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

—————————————

కుంభం

వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.

—————————————

మీనం

వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్