విద్య శాఖాధిపతిగా శ్యామలరావు.. రవాణా, రోడ్లు భవనాల శాఖాధిపతిగా కోన శశిధర్..? వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులుగా ప్రచారం ఉన్న ఐఏఎస్ అధికారులకు మాత్రమే కీలక, ప్రాధాన్యత పోస్టులు దక్కాయనేది వాస్తవం. కానీ ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. చంద్రబాబు హయాంలో కూడా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులకే కీలక, ప్రాధాన్యత పోస్టులు దక్కుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన అభిమాన ఐఏఎస్ అధికారులుగా ప్రచారం ఉన్న వారిని.. అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా దూరం పెట్టారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు.
Also Read : దేశంలో మరో వైరస్.. పిల్లలే టార్గెట్..?
అర్ధం, పరమార్ధం ఏమిటంటే.. టీడీపీ, జనసేన అభిమానులుగా ముద్రపడిన ఐఏఎస్ అధికారులు కంటే.. వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులుగా ప్రచారం ఉన్న వారే కీలక, ప్రాధాన్యత పోస్టులలో ఇప్పుడు కూడా కనిపిస్తున్నారనేది సచివాలయంలో వినిపిస్తున్న మాట. “వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులయినా ఒకే.. చెప్పిన పనులు చక్కబెడితే చాలు..” అని చంద్రబాబు అనుకుంటున్నారా.. అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. పార్టీలో కీలక నేతతో పాటు మంత్రివర్గంలో చక్రం తిప్పుతున్న నేత కూడా చంద్రబాబునే ఈ విషయంలో అనుసరిస్తున్నారట. ప్రస్తుతం సీఎంఓలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులలో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులనే ప్రచారం బాగా ఉంది.
అదే విధంగా విద్య శాఖలో కూడా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులదే హవా నడుస్తుందట. రేపో, మాపో జరగబోయే ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లలో భారీగా మార్పులు, చేర్పులు జరగనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. విద్య శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారిగా ప్రచారం ఉన్న కోన శశిధర్‌ను ఆర్ అండ్ బీ శాఖాధిపతిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో జీఏడీ పొలిటికల్ శాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మరో వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారిగా ప్రచారం ఉన్న శ్యామలరావును నియమించనున్నట్లు సమాచారం.
Also Read : రాజకీయాల్లోకి త్రిష..? సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..?
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు చేర్పులు భారీగా ఉంటాయనే మాట బాగా వినిపిస్తోంది. ఈ మార్పుల్లో కీలక, ప్రాధాన్యత పోస్టులు దక్కించుకునేందుకు కొందరు అధికారులు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ అభిమాన అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్న వారు మాత్రం.. సీఎంఓలో ఉన్న ఓ కీలక అధికారిని ప్రసన్నం చేసుకునే పనిలీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పని అయిపోయినట్లే అని బలంగా నమ్ముతున్నారంట. మరి ఎవరికి

