Tuesday, August 4, 2026 06:02 PM
Tuesday, August 4, 2026 06:02 PM

వైసీపీ లో బోరుగడ్డ తిరుగుబాటు..కారణం అదేనా..?

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రెచ్చిపోయాడు. అరగంట టైమ్ ఇస్తే చాలు.. అంటూ లేని పోని సవాళ్లు విసిరాడు. నేనేవరో తెలుసా.. నా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా అంటూ ప్రగల్భాలు పలికాడు. నేను తలుచుకుంటే.. అంటూ ఏవేవో మాటలు చెప్పాడు. ఒక దశలో ఆడ మగ అనే తేడా లేకుండా బూతులతో రెచ్చిపోయాడు. తలకాయలు తెగిపడతాయి అంటూ బెదిరించాడు. నా ముందు వాడెంత, వీడెంత అంటూ మైకుల ముందు పిచ్చి వాగుడంతా వాగాడు. ఇదంతా 2024 ఎన్నికలకు ముందు. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేసిన సవాళ్లన్నీ ఏమయ్యాయో తెలియదు. బెదిరింపులన్నీ ఎటు పోయాయో తెలియదు.

Also Read : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై దేశంలో బైక్ అంబులెన్స్‌ లు..!

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎగిరెగిరి పడ్డారు. వీరిలో కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతే.. మరికొందరు మీడియా మైకుల ముందు, యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో మాత్రమే కనిపించారు. అంతే తప్ప.. బయట ఎక్కడా కనిపించలేదు. అలాంటి వారిలో శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ ఉన్నారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో రెచ్చిపోతే.. బోరుగడ్డ అనిల్ మాత్రం కొన్ని వైసీపీ అనుకూల యూట్యాబ్ ఛానల్స్ ద్వారా నోటికి వచ్చినట్లు వాగాడు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పైన నోటికి వచ్చినట్లు బూతులతో రెచ్చిపోయాడు. జగన్ అనుమతి ఇస్తే చంద్రబాబు, పవన్‌ను అరగంటలో నరికేస్తా అంటూ పనికిమాలిన మాటలన్నీ చెప్పాడు.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని బోరుగడ్డ అనిల్ చెప్పుకునేవాడు. నిజానికి ఈ పార్టీ ఎన్‌డీఏలో భాగస్వామి. కానీ.. బోరుగడ్డ మాత్రం జగన్ భక్తుడు. తన కార్యాలయంలో జగన్ ఫోటో పెట్టుకున్నాడు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ బోరుగడ్డ అయ్యాడు. గుంటూరులో రియల్టర్‌లను బెదిరించిన కేసులతో పాటు కిడ్నాప్ కేసులో కూడా బోరుగడ్డను పోలీసులు అరెస్టు చేశారు. నెలల తరబడి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే ఆ సమయంలోనే వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై బోరుగడ్డ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని.. సజ్జల తిట్టమని చెబితేనే తిట్టినట్లు చెప్పాడు.

Also Read : దేశంలో మరో వైరస్.. పిల్లలే టార్గెట్..?

బెయిల్ పైన బయటకు వచ్చి న బోరుగడ్డ అనిల్.. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ ముందు తన భార్యతో కలిసి ధర్నా చేశాడు. వైసీపీలోకి తనను రానివ్వటం లేదని.. అలా రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. జగన్ మోహన్ రెడ్డిని కలవాలని ఎన్నో రోజులుగా తాను ప్రయత్నం చేస్తుంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి కలవనీయటం లేదని బోరుగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల తన అనుచరులతో తనను రౌడీషీటర్ అని ప్రచారం చేయిస్తున్నారని బోరుగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినా కూడా.. ఇప్పటికీ కొందరు ఎగతాళి చేస్తున్నారని.. అలాంటి వారికి నోటీసులు కూడా ఇచ్చామన్నాడు. తనను రౌడీషీటర్ అని నిందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ అనిల్ డిమాండ్ చేశాడు. సజ్జల రామకృష్ణా రెడ్డి చేస్తున్న ఆరాచకాలను జగన్‌కు చెప్పటమే తన లక్ష్యం అని బోరుగడ్డ అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

పోల్స్