Wednesday, November 4, 2026 02:15 AM
Wednesday, November 4, 2026 02:15 AM

ఈరోజు రాశి ఫలితాలు (04-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాడ మాసం, బహుళ పక్షం.. 04-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

చిన్ననాటి మిత్రులతో కారణ కలహా సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

—————————————

వృషభం

చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణదాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

—————————————

మిధునం

సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

—————————————

కర్కాటకం

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

—————————————

సింహం

ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

—————————————

కన్య

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

—————————————

తుల

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

—————————————

వృశ్చికం

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

—————————————

ధనస్సు

నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

—————————————

మకరం

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.

—————————————

కుంభం

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికపరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.

—————————————

మీనం

చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బొత్స వారసురాలికి షాక్...

సినిమాల్లో, రాజకీయాల్లో వారసులు సక్సెస్ కావడం...

మావిగన్ ఫలితాలు.. మడత...

అనుకున్నంత అయ్యింది.. మునిసిపల్ ఫలితాలు వెలువడ్డాయి....

పాతికేళ్ళ తర్వాత మాచెర్ల...

పల్నాడు జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మాచర్ల...

కూటమి క్లీన్ స్వీప్.....

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అందరూ...

పులివెందుల కోట బద్దలు...

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన,...

బ్రేకింగ్: బెజవాడకు వరద...

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం...

పోల్స్