Monday, August 3, 2026 08:31 PM
Monday, August 3, 2026 08:31 PM

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం సంచలనం.. అసలు ఏంటి ఈ V 2 V..?

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక చారిత్రాత్మక ముసాయిదాను విడుదల చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రమాదాలను ముందే గుర్తించేలా.. ఒక వాహనం నుండి మరో వాహనానికి సమాచార మార్పిడిని సాధ్యం చేసే వెహికల్-టు-వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ ను దేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చట్టపరమైన సవరణలను ప్రతిపాదించింది.

Also Read : వైసిపి మాజీ ఎమ్మెల్యే ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989 ప్రకారం తీసుకువస్తున్న ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల భవిష్యత్తులో వాహనాలు ఒకదానితో ఒకటి రేడియో సిగ్నల్స్ ద్వారా నేరుగా కనెక్ట్ అవుతూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయి. ప్రస్తుతం వాహనాల్లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ పరిమితులను దాటి ఈ సరికొత్త సెల్యులార్ వెహికల్-టు-ఎవ్రీథింగ్ సాంకేతికత పనిచేస్తుంది. ఈ సరికొత్త సిస్టమ్ ద్వారా రోడ్డుపై వెళ్లే వాహనాలు తమ వేగం, దిశ, బ్రేకింగ్ ప్యాటర్న్స్ వంటి కీలక సమాచారాన్ని ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌ వర్క్‌ తో సంబంధం లేకుండానే 5.875 GHz నుండి 5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో ఒకదానికొకటి షేర్ చేసుకుంటాయి.

Also Read : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. సహజీవనంలో ఉన్న మహిళలకూ ఆ సెక్షన్..!

దీనివల్ల బ్లైండ్ టర్న్‌ ల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడం, దట్టమైన పొగమంచు సమయంలో ముందు వెళ్లే కారు అకస్మాత్తుగా బ్రేక్ వేసినా లేదా రోడ్డుపై ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నా.. మీ కారులోని డిస్‌ప్లే స్క్రీన్ ద్వారా డ్రైవర్‌ ను సెకన్ల వ్యవధిలో అలర్ట్ చేసి ఘోరమైన కొలిజన్ల నుండి ప్రాణాలు కాపాడుతుంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనల ప్రకారం, ఈ సరికొత్త రక్షణ వ్యవస్థను దేశంలో విడతల వారీగా అమలు చేయనున్నారు.

Also Read : ఉరవకొండలో పొలిటికల్ హీట్.. మాజీ ఎంపీ అరెస్ట్..!

2027 అక్టోబర్ 1 నుండి ఏవైనా కొత్త వాహనాలు ఫ్యాక్టరీల నుండే ఈ V2V కమ్యూనికేషన్ సిస్టమ్‌ తో తయారై వస్తే.. అవి ఖచ్చితంగా కేంద్రం నిర్దేశించిన AIS-230 భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఆ తర్వాత రెండో విడతలో, 2028 అక్టోబర్ 1 నుండి దేశంలో తయారయ్యే అన్ని కేటగిరీల ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు మరియు ట్రక్కులు, గూడ్స్ వాహనాల్లో ఈ V2V ఆన్-బోర్డ్ యూనిట్ సిస్టమ్‌ ను అమర్చడం తప్పనిసరి కానుంది. ఈ వినూత్న టెక్నాలజీతో రోడ్డు రవాణా వ్యవస్థ స్మార్ట్‌ గా మారడమే కాకుండా, రాబోయే రోజుల్లో దేశంలో రోడ్డు ప్రమాద మరణాలను 80 శాతం వరకు తగ్గించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

పోల్స్