తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపణ, ప్రత్యారోపణలతో మాటల తూటాలు పేలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి మళ్లీ గెలుస్తుందని.. తప్పకుండా 80 సీట్లు సాధిస్తుందని కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు లెక్కలు కూడా చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు అయితే టార్గెట్ రేవంత్ సర్కార్ అన్నట్లుగా మాటల దాడి చేస్తున్నారు.
Also Read : మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. కీలక ఆదేశాలు..!
ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు అయితే.. మరో అడుగు ముందుకు కూడా వేశారు. రేవంత్ సర్కార్‌కు పరిపాలన చేత కాదని.. అందుకే రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇవ్వలేకపోతున్నారన్నారు. తనకు మూడు నెలలు మంత్రిగా అవకాశం ఇస్తే.. నీళ్లు పారిస్తా అని.. లేదంటే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని సవాల్ చేశారు కూడా. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలకు కంట్లో నలుసుగా మారారు కేసీఆర్ గారాల పట్టి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. టార్గెట్ కేటీఆర్, హరీష్ అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి.
బీఆర్ఎస్ ఖాతాలో రూ.1400 కోట్లు ఉన్నాయని.. అవి ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ల ద్వారా వచ్చినవే అని ఆరోపించారు. అదే సమయంలో హరీష్ రావు సొంత డెయిరీ నుంచి ఆంధ్ర ప్రాంతానికి చెందిన యాజమాన్యం నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలకు పాలు, పెరుగు పెద్ద ఎత్తున సరఫరా అవుతుందని.. అందుకే ఆ విద్యా సంస్థల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నా కూడా.. హరీష్ నోరు ఎత్తడం లేదన్నారు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్ల నుంచి కేటీఆర్‌కు కూడా పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయన్నారు. తనను అడ్డుకునేందుకు మీడియా పై ఒత్తిడి తీసుకువస్తున్నారని.. తాజాగా పయనీర్ అనే ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌ను కేటీఆర్ రూ.180 కోట్లతో కొన్నారన్నారు.
Also Read : హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్..!
కవిత చేసిన ఆర్థిక ఆరోపణలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ముందు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ.1400 కోట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అసలు అంత డబ్బులు ఒక పార్టీ ఖాతాలోకి ఎలా వచ్చాయి.. ఎవరెవరు ఎందుకు విరాళం ఇచ్చారనే కోణంలో విచారించాలంటున్నారు. క్విడ్ ప్రో కో జరిగిందన్న కవిత ఆరోపణలకు కూడా ఇప్పుడు భారీగా మద్దతు లభిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ సంస్థకు ఏ కాంట్రాక్ట్ అప్పగించారు.. ఆ సంస్థ బీఆర్ఎస్కు ఎంత విరాళం ఇచ్చిందనే కోణంలో కూడా విచారిస్తే.. ఆర్థిక దొంగలు బయటకు వస్తారంటున్నారు. మొత్తానికి కవిత చేసిన ఆరోపణలు.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను కూడా ఇరుకున పెట్టినట్లు అయింది. కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా జవాబిస్తారో చూడాల్సి ఉంది.

