Sunday, October 4, 2026 03:43 PM
Sunday, October 4, 2026 03:43 PM

అంత హైప్ వద్దు.. శ్రేయాస్ అయ్యర్ సంచలన కామెంట్స్..!

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌ కు ముందు టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఐర్లాండ్ సిరీస్‌ లో టీమిండియా ఓటమి తర్వాత సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ కు దీనిపై ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియాలో, బయట ఎక్కడ చూసినా వైభవ్.. వైభవ్ అంటూ నడుస్తున్న భారీ హైప్‌ను మేనేజ్ చేయడం కోచ్, కెప్టెన్‌ కు ఎంతవరకు కష్టంగా ఉందనే ప్రశ్నకు అయ్యర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

Also Read : రంగంలోకి రేవంత్ టీమ్.. రెడీ..!

సూర్యవంశీ చుట్టూ జరుగుతున్న ప్రచారంపై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. “నాకైతే అలాంటి హైప్ ఏమీ కనిపించడం లేదు. నిజంగా నాకు తెలియదు. నేను వార్తలను గానీ, సోషల్ మీడియా లేదా ఇన్స్టాగ్రామ్‌ ను గానీ అస్సలు ఫాలో అవ్వను. ఈ ప్రచారం గురించి నేనేమీ వినలేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు. మొదటి టీ20 మ్యాచ్‌ లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఉంటాడా లేదా అనే విషయాన్ని వెల్లడించడానికి అయ్యర్ నిరాకరించాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌ లో తమ జట్టు కాంబినేషన్‌ ను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నామని, ప్రత్యర్థికి ముందే వ్యూహాలను లీక్ చేయలేమని స్పష్టం చేశాడు.

Also Read : ముంబైకి హార్దిక్ పాండ్యా గుడ్‌బై.. ఇల్లు కూడా షిఫ్ట్..!

వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌ ను కెప్టెన్ అయ్యర్ అభినందించాడు. “కచ్చితంగా వైభవ్ ఒక అద్భుతమైన ప్రతిభావంతుడు. అతనికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా జట్టు కోసం రాణిస్తాడు” అని వెల్లడించాడు. అయితే, ప్రస్తుతం జట్టులో ఉన్న మిగిలిన ఆటగాళ్లంతా కూడా అద్భుతంగా రాణిస్తున్నారని, టీ20 ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్లకు ఈ ఫార్మాట్‌పై పూర్తి అవగాహన ఉందని గుర్తుచేశాడు. రాబోయే టోర్నమెంట్ల దృష్ట్యా ప్రతి ఆటగాడికి తగినన్ని అవకాశాలు ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం జట్టు మేనేజ్మెంట్‌ కు చాలా ముఖ్యమని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పవన్, లోకేష్ మధ్య...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్...

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫామ్ హౌస్...

మద్యం స్కామ్‌లో మరో...

గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన...

పోల్స్