Sunday, October 4, 2026 10:03 AM
Sunday, October 4, 2026 10:03 AM

వాట్సాప్ లో ఫోన్ నంబర్ పని లేదా..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల ప్రైవసీని మరింత పెంచేందుకు ఒక సరికొత్త ఫీచర్‌ ను తీసుకురాబోతోంది. ఇకపై మీ ఫోన్ నంబర్ ఇతరులకు ఇవ్వకుండానే, కేవలం ఒక ప్రత్యేకమైన యూజర్‌ నేమ్ ద్వారా ఇతరులతో చాట్ చేసే సదుపాయాన్ని కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి పైగా ఉన్న వాట్సాప్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ను దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో విడుదల కావడానికి ముందే, మీకు నచ్చిన యూజర్‌ నేమ్‌ ను ఇప్పుడే రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది.

Also Read : ఇప్పటికీ జగన్ నామస్మరణే..?

ఆఫీస్ గ్రూపులు, క్లాస్ గ్రూపులు లేదా కొత్తగా పరిచయమైన వారితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఫోన్ నంబర్ ఇవ్వడం చాలామందికి ఇష్టం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ ఈ యూజర్‌ నేమ్ ఫీచర్‌ ను డిజైన్ చేసింది. ఇందులో ఎవరి యూజర్‌ నేమ్స్ కూడా పబ్లిక్‌ గా కనిపించవు, వాట్సాప్ కూడా ఇతరులకు మీ పేరును రికమండ్ చేయదు. మీ కరెక్ట్ యూజర్‌ నేమ్ తెలిస్తేనే కొత్తవారు మీకు మెసేజ్ చేయగలరు. మరింత సెక్యూరిటీ కోసం వాట్సాప్ ఇందులో యూజర్‌ నేమ్ కీ అనే అదనపు ఫీచర్‌ను కూడా జోడిస్తోంది.

Also Read : ఎమ్మెల్యేలు.. వారితో తస్మాత్ జాగ్రత్త..!

దీనివల్ల ఎవరైనా మీ యూజర్‌ నేమ్ ద్వారా మీకు మెసేజ్ చేయాలనుకుంటే, వారు ముందుగా ఈ కీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చినప్పుడు ఈ కీని మార్చుకోవడం ద్వారా అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్‌ లను పూర్తిగా నియంత్రించవచ్చు. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాకముందే మీకు నచ్చిన పేరును రిజర్వ్ చేసుకోవడానికి కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి. మీ మొబైల్‌లో వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌ కు అప్డేట్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అక్కడ ఉన్న అకౌంట్ ఆప్షన్‌ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత యూజర్‌ నేమ్ అనే ఆప్షన్‌ ను సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన పేరు ఖాళీగా ఉంటే, దానిని ఎంచుకుని కన్ఫర్మ్ చేయండి. ఈ యూజర్‌ నేమ్ గరిష్టంగా 35 క్యారెక్టర్ల వరకు ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పవన్, లోకేష్ మధ్య...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్...

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫామ్ హౌస్...

మద్యం స్కామ్‌లో మరో...

గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన...

పోల్స్