మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఓ రోమియో’, ‘ఓదెల-2’ వంటి సినిమాలతో అలరించిన తమన్నా.. స్పెషల్ సాంగ్స్‌లో కూడా మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో నటిస్తోంది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో, బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 26న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : రేవంత్ సర్కార్ దెబ్బకు దిగి వచ్చిన ఎస్బీఐ..!
ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూసే విధానం తనకు అస్సలు నచ్చలేదని తమన్నా చాలా ఓపెన్‌గా చెప్పింది. సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా కనిపిస్తుంటుందని, హీరోయిన్లను స్క్రీన్‌పై గౌరవప్రదంగా చూపించే విషయంలో అక్కడ కొంత లోటు కనిపిస్తోందంటూ తన మనసులోని అసంతృప్తిని బయటపెట్టింది. భారతీయ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన పాటలు, డ్యాన్సులకు చాలా ప్రాధాన్యత ఉంటుందని.. ఈ విషయాన్ని తాను కెరీర్ ప్రారంభంలోనే గ్రహించానని తమన్నా తెలిపింది.
Also Read : కాపులకు జగన్ నమ్మకద్రోహం.. ఇదే సజీవ సాక్ష్యం
బాలీవుడ్‌లో కేవలం యాక్టింగ్ మాత్రమే చేసే హీరోయిన్లు కొందరైతే, గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యే వాళ్లు మరికొందరు ఉంటారన్నారు. కానీ, కేవలం ఒకే యాంగిల్‌కు పరిమితం కాకుండా.. అటు గ్లామర్ చూపిస్తూనే, ఇటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయగలిగిన వారే ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా ఎదుగుతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సౌత్ ఇండస్ట్రీలో కూడా తానే కాకుండా అనుష్క, నయనతార, సమంత వంటి వారు 10 నుంచి 15 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్లుగా నిలదొక్కుకున్నామంటే.. దానికి కారణం ఈ గ్లామర్, పెర్ఫార్మెన్స్ అనే రెండు విషయాలను పక్కాగా బ్యాలెన్స్ చేయడమేనని తమన్నా చెప్పుకొచ్చింది.

