Friday, May 15, 2026 03:01 PM
Friday, May 15, 2026 03:01 PM

పంజాబ్ కు ఇంకా ఛాన్స్ ఉందా..?

ఐపీఎల్ తాజా సీజన్‌ లో భాగంగా ధర్మశాలలో.. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన నేపధ్యంలో.. ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతుందా లేదా అనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. మొదట అద్భుతమైన ఫామ్‌ తో టోర్నీని ప్రారంభించిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టుకు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచులో పంజాబ్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ చివరి ఓవర్‌ లో మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది.

Also Read : మహేష్ ‘బాలీవుడ్ నన్ను భరించలేదు’ కామెంట్‌ పై విలన్ క్లారిటీ..!

ముంబై జట్టు అప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకోగా, పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ ఓటమితో తన అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది. తొలి 7 మ్యాచ్‌ ల తర్వాత ప్లేఆఫ్స్ చేరేందుకు 97 శాతం అవకాశాలు ఉన్న పంజాబ్ కింగ్స్, తాజా వరుస ఓటముల వల్ల ఆ అవకాశాలు 43 శాతానికి పడిపోయాయి. అయినప్పటికీ, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు 12 మ్యాచ్‌లలో 13 పాయింట్లు మరియు మెరుగైన నెట్ రన్ రేట్ తో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో పంజాబ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌ లు మిగిలి ఉన్నాయి.

Also Read : ఎస్ఐఆర్ మూడో దశ.. తెలుగు రాష్ట్రాల్లో పరిశీలన..!

ఆ రెండింటిలోనూ విజయం సాధిస్తే 17 పాయింట్లతో పంజాబ్ నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే 15 పాయింట్లతో నిలిచి, ఇతర జట్ల రన్ రేట్‌ పై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుత ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (16 పాయింట్లు), గుజరాత్ టైటాన్స్ (16 పాయింట్లు) మొదటి రెండు స్థానాల్లో నిలవగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ తర్వాత స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (12 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్ (12 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో గట్టి పోటీని ఇస్తున్నాయి. రాబోయే మ్యాచ్‌ లు పంజాబ్ కింగ్స్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో మాట నిలబెట్టుకున్న...

ఏపీలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలను...

మహానాడుపై టీడీపీ సంచలన...

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా అత్యంత...

బండి భగీరథ్‌ కు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పొదుపు బాటలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పొదుపు...

నా కోసం ట్రాఫిక్...

సాధారణంగా రాజకీయ నాయకులు వెళ్తున్న సమయంలో...

దస్తగిరి హ*త్య కేసులో...

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్...

పోల్స్