Tuesday, August 4, 2026 10:56 AM
Tuesday, August 4, 2026 10:56 AM

ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ఈ మధ్య కాలంలో గుండెపోటు అనే మాట సమాజాన్ని వణికిస్తుంది. ఎప్పుడు ఎవరు.. దాని ప్రభావంతో ప్రాణాలు కోల్పోతారో అర్ధం కాని పరిస్థితి. ముఖ్యంగా డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆర్టీసీ డ్రైవర్ లు పలువురు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సంక్షేమం దిశగా కీలక అడుగు వేసింది. ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులకు మే నెల నుంచి తప్పనిసరిగా పీరియాడికల్‌ హెల్త్‌ చెకప్‌ నిర్వహించాలని ఆదేశించింది.

Also Read : కేబినెట్ సమాచారం లీక్.. మంత్రులపై చంద్రబాబు డౌట్

45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేసింది. ప్రతి ఆరు నెలలకోసారి ఈ వైద్య పరీక్షలు నిర్వహించబడతాయని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఉద్యోగుల్లో పెరుగుతున్న అకాల మరణాలు, ముఖ్యంగా గుండెపోటు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అరికట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. మే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈ తనిఖీలు ప్రారంభమవుతాయని, అందరూ సహకరించాలని సర్కార్ కోరింది.

Also Read : శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం

గతంలో కేవలం డ్రైవర్ల ఆరోగ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. కానీ, పని ఒత్తిడి కారణంగా అన్ని విభాగాల సిబ్బంది అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పుడు కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది మరియు పరిపాలన విభాగం ఉద్యోగులను కూడా ఈ పరిధిలోకి చేర్చింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 45,000 మంది పైగా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

పోల్స్