Tuesday, August 4, 2026 04:48 PM
Tuesday, August 4, 2026 04:48 PM

డయాబెటిస్ రోగులకు ఊరట.. అమెరికా మార్కెట్లోకి జైడస్ కొత్త షుగర్ మందు..!

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఒక శుభవార్త చెప్పింది.. ప్రముఖ భారతీయ ఫార్మా కంపెనీ జైడస్ లైఫ్‌సైన్సెస్. ఈ సంస్థ తయారు చేసిన దపాగ్లిఫ్లోజిన్ జనరిక్ టాబ్లెట్లకు అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం లభించింది. ఈ మందు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడమే కాకుండా, గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్లు శరీరంలో ‘SGLT2 ఇన్హిబిటర్స్’గా పనిచేస్తాయి. సాధారణంగా మన మూత్రపిండాలు రక్తంలోని గ్లూకోజ్‌ ను మళ్ళీ శరీరంలోకి పంపిస్తాయి.

Also Read : బుమ్రాకే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు..!

అయితే, ఈ మందు ఆ ప్రక్రియను అడ్డుకుని, శరీరంలో ఉన్న అదనపు చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపివేస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ తో పనిలేకుండానే రక్తంలో చక్కెర లెవెల్స్ చాలా వేగంగా కంట్రోల్ అవుతాయి. ఈ మందు కేవలం డయాబెటిస్‌కే పరిమితం కాకుండా, గుండెకు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అలాంటి వారికి ఈ మందు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Also Read : పుకార్లకు చెక్.. కేరళలో తారక్ కలరిపట్టు వేట..!

అంతేకాకుండా, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ఉన్న రోగులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అమెరికా మార్కెట్లో జనరిక్ వెర్షన్‌కు అనుమతి లభించడం వల్ల, ఈ మందు తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి రానుంది. బరువు తగ్గడానికి, రక్తపోటును క్రమబద్ధీకరించడానికి కూడా ఈ మందు సహాయపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. జైడస్ సంస్థకు లభించిన ఈ ఆమోదం అంతర్జాతీయ ఫార్మా రంగంలో భారతీయ కంపెనీల ముద్రను మరోసారి చాటిచెప్పింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

పోల్స్