Wednesday, April 8, 2026 09:24 PM
Wednesday, April 8, 2026 09:24 PM

“రాకా” వందల కోట్ల బడ్జెట్.. వెయ్యి కోట్ల టార్గెట్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్ అట్లీ. పుష్ప సీరీస్ తో ఇండియా వైడ్ గా దుమ్మురేపిన.. ఐకాన్ స్టార్.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గత కొంతకాలంగా సస్పెన్స్‌లో ఉన్న బన్నీ-అట్లీ ప్రాజెక్ట్‌ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేసింది.

Also Read : పుకార్లకు చెక్.. కేరళలో తారక్ కలరిపట్టు వేట..!

టైటిల్ వినడానికి చాలా డిఫరెంట్ గా, ఒక రాక్షసుడి పేరులా అనిపిస్తోంది. విడుదలైన పోస్టర్‌ లో అల్లు అర్జున్ లుక్ చాలా రఫ్ గా, ఊరమాస్ గా ఉంది. అట్లీ తన సినిమాల్లో హీరోలను ఎంత స్టైలిష్ గా చూపిస్తాడో మనకు తెలిసిందే, కానీ ఈ రాకా పోస్టర్ చూస్తుంటే ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా లేదా మాఫియా బ్యాక్‌ డ్రాప్ సినిమా అయి ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జవాన్ తో బాలీవుడ్‌ను షేక్ చేసిన అట్లీ, ఇప్పుడు బన్నీతో కలిసి పాన్-వరల్డ్ రేంజ్‌ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

Also Read : దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!

ఈరోజు విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అవుతోంది. “రాకా ఈజ్ హియర్” అనే హ్యాష్ ట్యాగ్‌ తో అభిమానులు రచ్చ చేస్తున్నారు. పుట్టినరోజు రోజే ఇలాంటి అప్‌డేట్ రావడంతో భాయ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ క్రేజ్, అట్లీ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు ఈజీ అని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మరి పుష్పగా తగ్గేదేలే అన్న బన్నీ, ఇప్పుడు రాకాగా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రోజాకు బిగుస్తున్న ఉచ్చు.....

వైసీపీ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన...

భోగాపురం ముహుర్తం ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

బ్రేకింగ్ : రెడ్డప్పగారి...

పార్టీ కేడర్‌ను పట్టించుకోని నేతలపై టీడీపీ...

దేవాదాయ శాఖలో ఏసీబీ...

గత రెండేళ్ళ నుంచి ఏపీలో హాట్...

కేసీఆర్ బయటకు వస్తారా.....

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ...

తమిళనాడులో అలా.. మరి...

చట్టం అందరికీ సమానమే. బాధితులకు న్యాయం...

పోల్స్