Saturday, September 19, 2026 07:35 AM
Saturday, September 19, 2026 07:35 AM

ఫౌజీ లీకులపై మేకర్స్ సీరియస్.. లీక్ చేస్తే అంతే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, సెట్స్ నుండి ప్రభాస్ లుక్, కొన్ని కీలక దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంపై చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, లీకులకు పాల్పడుతున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో లీకైన కంటెంట్‌ ను ప్రచారం చేసే అకౌంట్లపై నిఘా ఉంచామని, అలాంటి పోస్ట్‌లను వెంటనే రిపోర్ట్ చేస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.

Also Read : బన్నీ సర్ ప్రైజ్.. టైటిల్, టీజర్ అనౌన్స్‌మెంట్‌ కు ముహూర్తం ఫిక్స్..!

మేము ఎంతో కష్టపడి నిర్మిస్తున్న ఈ సినిమాటిక్ అనుభవాన్ని లీకులతో పాడు చేయవద్దని కోరింది. లీకైన ఫోటోలను షేర్ చేయడం వల్ల సినిమాలోని మ్యాజిక్ దెబ్బతింటుందని, వెండితెరపై చూసే వరకు వేచి ఉండాలని మేము కోరుతున్నామని చిత్ర బృందం ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించింది. ఈ వివాదంపై దర్శకుడు హను రాఘవపూడి కూడా స్పందించారు. తాము ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నామన్నాడు.

Also Read : బ్రేకింగ్: ముగింపు దిశగా యుద్ధం..? ట్రంప్ డెడ్‌ లైన్ వేళ ఉత్కంఠ..!

ప్రేక్షకుల కోసం ఏదైనా ప్రత్యేకంగా అందించాలనే.. మా ప్రయత్నాన్ని లీకులతో పాడు చేయవద్దని మనవి చేస్తున్నానని.. సినిమాను థియేటర్లలోనే ఆస్వాదించండి అంటూ కోరాడు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌ తో, 1940ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభాస్ ఇందులో ఒక సైనికుడిగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, కొత్త హీరోయిన్ ఇమాన్వీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, లీకుల సమస్య చిత్ర బృందానికి పెద్ద సవాలుగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్