Monday, May 18, 2026 07:00 AM
Monday, May 18, 2026 07:00 AM

పాకిస్థాన్‌పై దాడిపై ఇండియన్ నావి సంచలన కామెంట్స్..!

ఆపరేషన్ సింధూర్.. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆపరేషన్ ఒక సంచలనం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాక్ భూభాగంలో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత నావికాదళం శత్రువును ఊపిరాడకుండా చేసేందుకు ఎంతటి భీకరమైన స్కెచ్ వేసిందో తాజాగా ఇండియన్ నావీ వెల్లడించింది. ఆ సమయంలో పాకిస్థాన్‌పై సముద్ర మార్గం ద్వారా దాడి చేయడానికి ఇండియన్ నేవీ కేవలం ‘కొన్ని నిమిషాల దూరంలో’ మాత్రమే ఉందని స్వయంగా నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగగా మారింది.

Also Read : జనసేన బలహీనమవుతుందా.. బలపడుతుందా..!

ఆ సమయంలో భారత నౌకాదళానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌకలు, విధ్వంసక నౌకలు, అత్యాధునిక జలాంతర్గాములు పాకిస్థాన్ తీర ప్రాంతానికి అతి సమీపంలో మోహరించాయని.. ప్రభుత్వం నుంచి ఒక్క ఆదేశం వస్తే చాలు.. పాక్ నావికా వ్యవస్థను కుప్పకూల్చేలా ప్లాన్ సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. నేవీ చీఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పట్లో భారత సైన్యం పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఉందట. మేము కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఉన్నామని, అటాక్ మోడ్‌ లో ఉన్న మా నౌకలు లక్ష్యాలను ఛేదించడానికి సిద్ధంగా ఉన్నాయని అడ్మిరల్ త్రిపాఠి చెప్పుకొచ్చారు.

Also Read : వార్ ఎఫెక్ట్.. ఫ్లైట్ చార్జీల బాదుడు ఓ రేంజ్ లో..!

ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చి ఉంటే.. పాకిస్థాన్ ప్రధాన ఓడరేవులు, తీర ప్రాంత రక్షణ కేంద్రాలు క్షణాల్లో బూడిద అయ్యేవన్నారు. తమ నౌకలు బయటకు వస్తే భారత్ ముంచేస్తుందనే భయంతో పాక్ నౌకాదళం కరాచీ పోర్టుకే పరిమితమైపోయిందట. పశ్చిమ సముద్ర తీరంలో.. ఆపరేషన్ సింధూర్ సమయంలో నౌకాదళం చేపట్టిన చర్యలు జాతీయభావాన్ని బలోపేతం చేశాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సామర్ధ్యాన్ని ప్రపంచానికి చూపించారని చెప్పుకొచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

నేడే బండి భగీరథ్...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పవన్ అడ్డా అదేనా.....

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతుకు...

పోల్స్