Thursday, April 2, 2026 09:53 PM
Thursday, April 2, 2026 09:53 PM

ఈరోజు రాశి ఫలితాలు (02-04-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం.. 02-04-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

—————————————

వృషభం

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది.

—————————————

మిధునం

వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు చెయ్యకపోవడం మంచిది.

—————————————

కర్కాటకం

కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

సింహం

వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

—————————————

కన్య

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

తుల

చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

—————————————

వృశ్చికం

సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

—————————————

ధనస్సు

శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది.

—————————————

మకరం

ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

—————————————

కుంభం

చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

—————————————

మీనం

ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబుకి తలనొప్పిగా మారుతున్న...

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలి టిడిపి...

బాబు మాస్టర్ స్ట్రోక్.....

అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి...

అంచనాలు పెంచిన ‘రామాయణ’...

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం...

అమరావతి అంటే జగన్...

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వత రాజధాని...

ఎమ్మెల్యేలు సీరియల్స్ చూడటం...

కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల తీరుపై...

ఈసారి మావిగన్ అంటున్న...

ఎవరికైనా చూపించండి రా.. అలా వదిలేయకండి...

పోల్స్