Monday, May 18, 2026 08:13 AM
Monday, May 18, 2026 08:13 AM

నేటి నుంచి అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. కీలక మార్పులు ఇవే..!

భారత ఆదాయపు పన్ను చరిత్రలో నేడు ఒక నూతన అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో సరికొత్త ఐటీ చట్టాన్ని కేంద్రం నేటి నుంచి అమలులోకి తీసుకువచ్చింది. పాత చట్టంలోని సంక్లిష్టతలను తొలగించి, పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా నిబంధనలను సవరించడమే ఈ కొత్త చట్టం ప్రధాన లక్ష్యంగా కేంద్రం చెప్తోంది. కొత్త చట్టం తీసుకురావడం ద్వారా పన్నుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

Also Read : దుమారం రేపుతున్న కాగ్ నివేదిక..!

పాత చట్టంలో ఉన్న కఠినమైన భాషను సరళతరం చేస్తూ కేంద్రం ఫైనాన్స్ చట్టాన్ని నోటిఫై చేసింది. దీనివల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులు కూడా తమ పన్ను బాధ్యతలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది. పన్ను ఎగవేతలను అరికట్టడంతో పాటు, నిజాయితీగా పన్ను కట్టే వారికి ప్రోత్సాహం అందించేలా నిబంధనలను రూపొందించారు. ఈ కొత్త చట్టంలో అతిపెద్ద మార్పు.. ట్యాక్స్ ఇయర్ విధానం. ఇప్పటివరకు ఆదాయపు పన్ను లెక్కల్లో అసెస్‌మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనే రెండు వేర్వేరు కాలమితులు ఉండేవి.

ఇది సామాన్యులకు కొంత గందరగోళాన్ని కలిగించేది. అయితే, నేటి నుంచి వీటి స్థానంలో కేవలం ఒకే ఒక ట్యాక్స్ ఇయర్విధానం అమలులోకి వచ్చింది. అంటే మీరు ఏ ఏడాది ఆదాయం సంపాదిస్తారో, అదే ఏడాది పన్ను లెక్కలు కూడా పూర్తవుతాయి. కొత్త చట్టం ప్రకారం అసెస్‌మెంట్ ప్రక్రియలో వేగం పెరగనుంది. టెక్నాలజీని పెద్దపీట వేస్తూ ఫేస్‌ లెస్ అసెస్‌మెంట్లను మరింత బలోపేతం చేశారు. వివాదాల పరిష్కారానికి కూడా ప్రత్యేక గడువులను నిర్ణయించారు. తద్వారా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

Also Read : ధర్నా వ్యవహారంపై సిఎం ఆరా.. షాక్ అయిన అధికారులు..!

పన్ను నోటీసుల జారీ మరియు రిటర్నుల దాఖలు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చారు. ఈ మార్పుల వల్ల పన్ను చెల్లింపుదారులకు కంప్లైయన్స్ భారం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్ను శ్లాబుల్లో మార్పులు లేకపోయినా, పన్ను కట్టే విధానం సులభతరం కావడం వల్ల మధ్యతరగతి ప్రజలకు, చిన్న వ్యాపారులకు గొప్ప ఊరట లభించనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ఈ కొత్త ఐటీ చట్టం కీలక అడుగుగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

నేడే బండి భగీరథ్...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పవన్ అడ్డా అదేనా.....

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతుకు...

పోల్స్