Tuesday, March 31, 2026 06:30 AM
Tuesday, March 31, 2026 06:30 AM

ఈరోజు రాశి ఫలితాలు (31-03-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం.. 31-03-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

వృషభం

మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

—————————————

మిధునం

ఇంటాబయటా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

—————————————

కర్కాటకం

కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

—————————————

సింహం

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బుఅందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు.

—————————————

కన్య

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

—————————————

తుల

చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

—————————————

వృశ్చికం

వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

—————————————

ధనస్సు

వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంబందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు.

—————————————

మకరం

కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు.

—————————————

కుంభం

నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

—————————————

మీనం

చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో ముగిసిన మావోల...

ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు...

నాయుడుపై వేటు.. కొత్తగా...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

ఒక్క కార్టూన్‌కే భయపడితే...

ఒక్క కార్టూన్‌కే భయపడితే ఎలా..? ఇప్పుడు...

ఒంటిమిట్ట కల్యాణం పౌర్ణమి...

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి...

ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో...

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...

చెల్లెలు కోసం అన్నకు...

తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా...

పోల్స్