Friday, July 3, 2026 03:24 PM
Friday, July 3, 2026 03:24 PM

లిపోప్రొటీన్ ఏ.. ఫిట్‌గా ఉన్నవారికి కూడా గుండెపోటు ప్రమాదం..!

చాలామంది యువకులు తమకు అలవాట్లు లేవని, వ్యాయామం చేస్తున్నామని, సాధారణ కొలెస్ట్రాల్ రిపోర్టులు ఉన్నాయని ధీమాగా ఉంటారు. అయితే, సాధారణ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో కనిపించని లిపోప్రొటీన్ ఏ అనే జన్యుపరమైన కొవ్వు కణం గుండెపోటుకు ప్రధాన కారణమవుతోంది. ఇది చూడటానికి చెడు కొలెస్ట్రాల్ లాగే ఉన్నప్పటికీ, దీనికి అదనంగా ఉండే ఒక జిగట ప్రోటీన్ వల్ల రక్త నాళాల్లో పూడికలు ఏర్పడటం చాలా వేగంగా జరుగుతుంది. ఫలితంగా, ఫిట్‌ గా ఉన్న యువకుల్లో కూడా అకస్మాత్తుగా ధమనులు మూసుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Also Read : ద్వారంపూడికి చెక్..? ఫోకస్ పెట్టిన సర్కార్..!

ఈ సమస్యలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, లిపోప్రొటీన్ ఏ.. లెవెల్స్ అనేవి మనం తినే ఆహారం లేదా చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉండవు. ఇవి పూర్తిగా మన జన్యువుల ద్వారా నిర్ణయించబడతాయట. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చిన చరిత్ర ఉంటే, మీకు కూడా లిపోప్రొటీన్ ఏ.. ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణ కొలెస్ట్రాల్ టెస్ట్ లు.. కేవలం పైపైన ఉండే కొవ్వును మాత్రమే చూపిస్తాయి కానీ, రక్త నాళాలను లోపల నుండి దెబ్బతీసే ఈ ప్రమాదకరమైన అంశాన్ని గుర్తించలేవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read : వారికి దూరంగా ఉండండి.. జగన్ ఆదేశం..!

ముఖ్యంగా భారతీయుల్లో ఈ ముప్పు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. లిపోప్రొటీన్ ఏ.. కేవలం ధమనుల్లో అడ్డంకులను సృష్టించడమే కాకుండా, రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోయి స్ట్రోక్ లేదా గుండెపోటు సంభవిస్తుంది. అందుకే, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా కుటుంబంలో ఈ చరిత్ర ఉన్నవారు, జీవితంలో కనీసం ఒక్కసారైనా లిపోప్రొటీన్ ఏ.. బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అత్యంత అవసరం. ప్రస్తుతానికి ఈ లిపోప్రొటీన్ ఏ.. ని పూర్తిగా తగ్గించడానికి ప్రత్యేకమైన మందులు అందుబాటులో లేనప్పటికీ, దీని లెవెల్స్ తెలుసుకోవడం వల్ల ఇతర జాగ్రత్తలు తీసుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

సీఎంఓ‌లోకి మరో జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన...

తమిళ రాజకీయాల్లో సంచలనం.....

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ...

పోల్స్