తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో, స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 27న మహాబలిపురంలో జరగనున్న పార్టీ కీలక సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలోనే రాబోయే ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాలను విజయ్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల ఎంపిక కోసం విజయ్ స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
Also read : బ్రేకింగ్: డేంజర్ జోన్ లో బెజవాడ..? అసలేం జరుగుతోంది..?
ఇప్పటికే సుమారు 110 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మహాబలిపురం సమావేశంలోనే ఈ 110 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను విజయ్ విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తమిళ మీడియా వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం.. ఆయన రెండు నియోజకవర్గాల నుండి బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.
Also read : మర్యాదగా ఉండు.. కోపం వద్దు.. గంభీర్ కు గంగూలీ సలహా..!
తన పట్టును నిరూపించుకునేందుకు చెన్నైలోని ఒక స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా పెరంబూర్ లేదా ఉత్తర చెన్నై నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. దక్షిణాది ఓటర్లను ఆకట్టుకునేందుకు మధురై నుండి కూడా ఆయన పోటీ చేసే అవకాశం మెండుగా ఉంది. ఎటువంటి పొత్తులు లేకుండా 234 స్థానాల్లోనూ టీవీకే ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల జరిగిన సమావేశంలో మహిళల కోసం అన్నపూర్ణి సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలను విజయ్ ప్రకటించారు. అధికార డీఎంకే మరియు ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కూటములకు దీటుగా విజయ్ తన వ్యూహాలను రచిస్తున్నారు.

