Tuesday, March 24, 2026 11:18 AM
Tuesday, March 24, 2026 11:18 AM

ఈరోజు రాశి ఫలితాలు (23-03-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం.. 23-03-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

—————————————

వృషభం

ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది.

—————————————

మిధునం

వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి .చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

—————————————

కర్కాటకం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది.కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయాలు చెయ్యలేరు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

సింహం

ఊహించని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవచింతన పెరుగుతుంది.

—————————————

కన్య

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

—————————————

తుల

అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

—————————————

వృశ్చికం

వృత్తి ఉద్యోగమున చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ యత్నాలు చేస్తారు.

—————————————

ధనస్సు

బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

—————————————

మకరం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

కుంభం

వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు.

—————————————

మీనం

కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!

హైదరాబాద్‌ను అధిగమించేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని...

శ్రీశైలం డ్యామ్ పునాదులు...

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల...

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

పోల్స్