Thursday, September 17, 2026 10:44 PM
Thursday, September 17, 2026 10:44 PM

జూమ్ చేసి అసభ్యకరంగా చూపించొద్దు..!

‘మా బాడీని జూమ్ చేసి అసభ్యకరంగా చూపించొద్దు’.. అంటూ నటీమణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్స్‌కి వెళ్లినప్పుడు.. నటీమణులను అసభ్యకర రీతిలో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని కన్నడ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటీమణుల శరీర భాగాల్ని జూమ్ చేసి చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని పలువురు హీరోయిన్స్ తప్పు బడుతున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలా చేయడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ఇలాంటివి మానుకోవాలని సూచించారు.

Also Read : కల్తీ నెయ్యి కేసు: కమిషన్ రిపోర్ట్‌తో రాజకీయ దుమారం?

సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో పాటు బాడీ పార్ట్స్ జూమ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కన్నడ నటీమణులు గళం విప్పారు. కొంత మంది వల్ల ఈవెంట్‌కు రావాలంటేనే భయం వేస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమలోని ప్రతిభను చూడాలి తప్ప.. బాడీ పార్ట్స్ కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా కాంతార సినిమా హీరోయిన్ సప్తమీ గౌడ ఈ సమస్యను లేవనెత్తారు. ఈమెకు ఇప్పుడు రుక్మిణి వసంత్, ఆషికా రంగనాథ్, దివ్యతో పాటు పలువురు నటీనటులు కూడా మద్దతు తెలుపుతున్నారు.

సినిమా పరిశ్రమలో మహిళలుగా ఉన్న తాము.. సమస్యను పరిష్కరించడంలో కలిసి నిలబడతామంటూ సప్తమి గౌడ కామెంట్ చేశారు. పబ్లిక్ ఈవెంట్లలో మహిళా నటుల వీడియోలు, ఫోటోలను పదే పదే చిత్రీకరించి, అనవసరమైన జూమ్‌లతో మా పని కంటే మా శరీరాలపై దృష్టి పెడుతూ.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారన్నారు. కొంతమంది వ్యక్తులు చేసే ఈ ప్రవర్తన అగౌరవకరమైనదని.. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మేము కళ కోసం, మా సినిమా కోసం ఇక్కడ ఉన్నామన్నారు. తమను అసభ్యంగా చూపించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సప్తమి గౌడ తెలిపారు. ఈ అంశంపై ప్రతి మహిళతో మేము సంఘీభావంగా నిలుస్తామని.. ఒకరికొకరు మద్దతు ఇస్తూనే ఉంటామన్నారు.

Also Read : ఇరాన్ దెబ్బకు.. అమెరికా – ఇజ్రాయిల్ అధినేతల మధ్య గ్యాప్..?

సప్తమి గౌడ పెట్టిన ఇదే మెసేజ్‌ను పలువురు హీరోయిన్లు, నటీమణులు కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వీరికి మహిళా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఇలా బాడీని జూమ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్‌లోకి రావాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి తలెత్తుతోందన్నారు. ఇలా అసభ్యకరంగా చూపించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్