Monday, March 2, 2026 10:00 PM
Monday, March 2, 2026 10:00 PM

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి మంత్రి కొండపల్లి భరోసా

ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామన్న మంత్రి

హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని కోరిన మంత్రి

ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా, గల్ఫ్ దేశాలలో నెలకొన్న, పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని, రాష్ట్ర ఎన్‌.ఆర్‌.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సంబంధిత శాఖ మంత్రిగా తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read : టార్గెట్ బీఆర్ నాయుడు.. డీప్ ఫేక్ తో వైసీపీ దారుణం

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్నార్టీ) ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన సహాయం చేసేందుకు గాను, గల్ఫ్ దేశాలలో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసి, స్థానికంగా ఉన్న తెలుగు కుటుంబాల సహకారంతో తాత్కాలిక వసతి, భద్రత మరియు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏపీ ఎన్నార్టీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తూ, కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి తెలిపారు. స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

Also Read : అష్టగ్రహ కూటమి వేళ.. యుద్ధ జ్వాలల్లో పశ్చిమాసియా!

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ వివరాలను క్రింది ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ 0863-2340678, వాట్సాప్: +91 85000 27678 నెంబర్లకు తెలియజేయవచ్చని, ఈమెయిల్: helpline@apnrts.com లకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే సంప్రదించి సహాయం పొందవలసిందిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏఐ డీప్‌ఫేక్ కలకలం...

సాంకేతికతను ఆసరాగా చేసుకుని మహిళల గౌరవానికి...

మహిళలకు ఏపీ సర్కార్...

ఏపీ ప్రభుత్వం పరిపాలనలో వేగం పెంచి,...

మహిళా దినోత్సవ కానుకగా...

ఏపీలో మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం...

ప్లీజ్.. అతన్ని రీప్లేస్...

ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా...

సోషల్ మీడియా లీక్...

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ...

టార్గెట్ బీఆర్ నాయుడు.....

తిరుమల విషయంలో మరో వివాదం ఇప్పుడు...

పోల్స్