Friday, June 19, 2026 02:16 PM
Friday, June 19, 2026 02:16 PM

క్రికెట్ లీగ్.. కెప్టెన్లు గా పవన్ వర్సెస్ లోకేష్..!

ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో గత ఏడాది మాదిరిగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. గత ఏడాది.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను జట్లుగా విభజించి.. క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్ సహా పలు ఆటల పోటీలను నిర్వహించారు. దీనికి అప్పట్లో మంచి స్పందన వచ్చింది. పరిపాలన, ప్రజాసేవ, ఇతర కార్యక్రమాలతో ఉండే సభ్యులకు ఇది ఆట విడుపుగా ఉపయోగపడింది.

Also Read :పాపం వైసీపీ.. అప్పుడు.. ఇప్పుడు ధర్నాలే..!

ఇక తాజాగా మరోసారి ఏపీ సర్కార్ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. రేపటి నుంచి మూడు రోజల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తారు. క్రికెట్ తో పాటు క్యారమ్స్, టెన్నిస్ ఇలా రకరకాల పోటీలు నిర్వహించనుంది ఏపీ సర్కార్.

Also Read :ఆ స్టేడియంలో ఆడితే అంతే సంగతులు..!

ఎమ్మెల్యేల క్రికెట్ లో రెండు లేదా మూడు టీమ్స్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక టీమ్ కెప్టెన్ గా మంత్రి లోకేష్ ఉండే ఛాన్స్ ఉంది. మరో జట్టు సారథిగా నాదెండ్ల మనోహర్ ఉంటారు. మూడో టీం కెప్టెన్ గా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది. గత ఏడాది నిర్వహించిన పోటీల్లో మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఇప్పుడు పవన్ ఆడటంతో.. లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జట్ల మధ్య పోరు ఉండే అవకాశం ఉండవచ్చు. జట్లలో ఎవరు ఎవరు ఉంటారు అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్