Tuesday, February 17, 2026 03:24 PM
Tuesday, February 17, 2026 03:24 PM

బ్రేకింగ్: ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు

23 ఏళ్ళ నుంచి సంచలనంగా మారిన  సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. సిద్దార్థ్ రెడ్డి నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని నేడు సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ప్రత్యూష ఆత్మహత్య కేసులో, హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం కోర్ట్ సమర్ధించడమే కాకుండా పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. పోస్టుమార్టంను అన్ ప్రొఫెషనల్‌ గా నిర్వహించారని కూడా అభిప్రాయపడింది.

Also Read : బ్రేకింగ్: టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ కపుల్

నటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కలిసి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ను తాగారు. 2002 ఫిబ్రవరి 23న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరుసటి రోజున ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది. ఇక సిద్దార్థ్ రెడ్డి చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఇక ఈ ఘటనపై అప్పటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదని, ఆత్మహత్యకు ప్రేరేపించడంగా అనుమానించారు. ఇక ఇది హత్యా అంటూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. ఆ తర్వాత సిబిఐ కేసును టేకప్ చేసింది.

Also Read : బెజవాడ మేయర్ గా వంగవీటి వారసురాలు..?

సిద్ధార్థ రెడ్డిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయగా.. 2004లో సిద్ధార్థ రెడ్డికి సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పుడు సిద్దార్థ్ రెడ్డి పోరాటం చేయగా, 2011లో హైకోర్టు.. ఈ శిక్షను రెండేళ్లకు తగ్గించి, రూ.50,000 జరిమానా విధించగా, సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తల్లి ఇద్దరూ 2012లో సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి, అతడికి శిక్ష పెంచాలంటూ నటి ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీం కోర్టుకు వెళ్ళగా, గత ఏడాది నవంబర్ లో కోర్ట్ వాదనలు తర్వాత, తీర్పును రిజర్వ్ చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ విషయంలో టీడీపీ...

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైసీపీ నేతల...

ఆ సీటు ఎవరికి...

వైసీపీ ఓటమికి కారణాలేమిటి..? వైసీపీ ఓడిపోవడానికి...

బ్రేకింగ్: లిక్కర్ కేసులో...

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు విషయంలో...

బెజవాడ మేయర్ గా...

రాజకీయాల్లోకి ఎప్పుడు, ఎవరు, ఏ రూపంలో...

జగన్ ఢిల్లీ ప్రయత్నాలు...

2019 లో వైఎస్ జగన్ సిఎం...

బ్రేకింగ్: టాలీవుడ్ లో...

టాలీవుడ్‌లో ప్రముఖ నటులు రష్మిక మందన్న...

పోల్స్