Saturday, August 15, 2026 05:03 PM
Saturday, August 15, 2026 05:03 PM

లోకేష్ కు జనసైనికులు జై.. ఎందుకలా..?

నేటి రాజకీయాల్లో మాటకు మాట సమాధానం ఇచ్చే వాడికే ప్రాధాన్యత ఉంటుంది. సబ్జెక్ట్ ఎంత ఉన్నా స్వరం లేకపోతే రాజకీయాలకు సూట్ అవ్వదు. ఈ విషయాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు మంత్రి నారా లోకేష్. సరిగా మాట్లాడలేరు అనుకున్న వాళ్లకు తన మాటలతో మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇస్తున్నారు. తాజాగా ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. మండలిలో ఓ చర్చ జరిగింది. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన అంశంపై విమర్శలు వచ్చాయి. దీనిపై లోకేష్ ఘాటు సమాధానం ఇచ్చారు.

Also Read : విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

తల్లిని చెల్లిని అంటే మీరు ఉపెక్షిస్తారు గాని మేము ఊరుకోము అంటూ.. హై వాల్యూంలో లోకేష్ సమాధానం ఇచ్చారు. మండలి ప్రతిపక్ష నేత బొత్సా సత్యనారాయణను ఉద్దేశించి.. అంబటి వ్యాఖ్యలకు మీరు మద్దతు ఇస్తారా లేదా డైరెక్ట్ గా చెప్పాలని లోకేష్ నిలదీశారు. దీనితో బొత్సా వాకౌట్ అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా తల్లినే కాదు ఎవరి తల్లిని, అక్కను, చెల్లెను అంటే ఊరుకునేది లేదని లోకేష్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

Also Read : అంబటి దెబ్బ.. ఆ నేతల్లో కలవరం..!

హోం మంత్రి అనిత మాట్లాడే సమయంలో వైసీపీ అడ్డు తగులుతుంటే.. లోకేష్ నిలబడి ఆమెకు అండగా నిలిచారు. దీనిపై జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో లోకేష్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. లోకేష్ ఆన్ ఫైర్ అంటూ.. ఒకప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు కూడా అభినందిస్తూ కామెంట్ చేసారు. జగన్ ఇందుకే అసెంబ్లీకి రావట్లేదని, బొత్సాను బలిపశువును చేసారు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. జనసేన సోషల్ మీడియా ఖాతాలలో లోకేష్ స్పీచ్ ఎక్కువ వైరల్ అయింది. ఇక అంబటి విషయంలో వైసీపీ కుల రాజకీయం చేసే ప్రయత్నం చేసినా.. జనసేన ఎంటర్ కావడంతో వాతావరణం మారిపోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

STREE SHAKTI: WOMEN’S...

AMARAVATI*: To mark Stree Sakti...

బంగ్లాదేశ్‌ ను భారత్...

భారతదేశం నుండి అదనంగా డీజిల్ సరఫరా...

తొలిరోజే 31 విమానాలు.....

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం...

జోగి సీటు చిరిగినట్లేనా.....

జోగి రమేష్.. ఈ పేరు పెద్దగా...

మళ్లీ కొత్త పాట...

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.....

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

పోల్స్