Wednesday, May 20, 2026 05:36 PM
Wednesday, May 20, 2026 05:36 PM

అంబటి దెబ్బ.. ఆ నేతల్లో కలవరం..!

వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబును అసభ్య పదాలతో బండబూతులు తిట్టిన కేసులో అంబటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే.. ఇంటి దగ్గర స్వీట్లు పంచుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. ఇక అంబటి రాంబాబు పేరుతో ఉన్న అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో కూడా “దౌర్జన్యాలు, దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవు..!”.. అంటూ పోస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉంటే.. ఆ పోస్టు కుటుంబ సభ్యులు లేదా అంబటి సిబ్బంది అలా పెట్టి ఉంటారని అంతా అనుకున్నారు.

Also Read : టాలీవుడ్‌లో కొత్త వ్యక్తులు.. పెత్తనానికి బ్రేక్..!

ఇక అంబటి రిలీజ్ ఖాయమని అంతా అనుకుంటుంటే.. పోలీసులు షాక్ ఇచ్చారు. 2023 సంక్రాంతి పండుగ సమయంలో లాటరీ నిర్వహించారని అంబటి రాంబాబుపై సత్తెనపల్లి జనసేన పార్టీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసును అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంచిన పోలీసులు.. సరిగ్గా సమయం చూసి ఆ కేసు దుమ్ము దులిపారు. దీంతో ఇప్పుడు మరోసారి అంబటికి కోర్టు రిమాండ్ విధించడంతో.. మళ్లీ జైలు తప్పలేదు. నిజానికి అంబటి కోసం పోలీసులు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఓడిన నాటి నుంచి పోలీసులపై అంబటి చాలా సార్లు నోరు పారేసుకున్నారు. జగన్ సత్తెనపల్లి పర్యటనలో, గుంటూరులో సీఐకి వార్నింగ్.. ఇలా చాలాసార్లు పోలీసులతో అంబటి దురుసుగా ప్రవర్తించారు. దీంతో అంబటి కోసం అధికార కూటమి నేతల కంటే.. పోలీసులే ఎక్కువ ఎదురు చూశారనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : అమెరికాలో వైద్యుల కొరత.. ట్రంప్‌పై మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం..!

అంబటి రాంబాబును వరుస కేసుల్లో అరెస్టు చేయడంతో.. వైసీపీ నేతల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై నోటికొచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్న పేర్ని నాని, జోగి రమేశ్ వంటి నేతలతో పాటు పదే పదే విమర్శలు చేస్తున్న గుడివాడ అమర్నాథ్, వరుదు కల్యాణి వంటి నేతలు ఇప్పుడు మీడియా ముందుకు కూడా రావటం లేదు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రం సోషల్ మీడియాలో పోస్టులతో సరిపెడుతున్నారు. అంతే తప్ప.. బయటకు వస్తే.. అరెస్టు ఖాయమని భయపడుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా చిలకలూరిపేట సీఐపై దూకుడుగా వ్యవహరించిన విడదల రజినీ వారం రోజులుగా కనిపించటం లేదు. జగన్ గుంటూరు పర్యటన వరకు హడావుడి చేసిన రజిని.. ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆమెపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదైంది. వీటితో పాటు మరో నాలుగు కేసులు కూడా రెడీ ఉన్నట్లు సమాచారం. ఈ కేసుల్లో తన అరెస్టు ఖాయమనే భయంతోనే రజినీ బయటకు రావటం లేదంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి అంబటి రాంబాబు అరెస్టు.. వైసీపీ నేతలను కలవరపెడుతోందనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్