Tuesday, February 10, 2026 06:48 PM
Tuesday, February 10, 2026 06:48 PM

‘యుఫోరియా’.. సమాజానికో పాఠం..!

‘చూడాలని ఉంది’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని సరికొత్తగా తెరపై చూపించిన దర్శకుడు, ‘బాల రామాయణం’ సినిమాతో నందమూరి తారక రామారావును తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు, ‘ఒక్కడు’ సినిమాతో మహేష్ బాబు గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసిన దర్శకుడే ఈ ‘యుఫోరియా’ సినిమా దర్శకుడు అన్న సంగతి ప్రస్తుతం చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి దర్శకుడు ఇన్నేళ్ల తరువాత వచ్చాడంటే ఎలాంటి కాన్సెప్ట్‌తో వచ్చి ఉంటాడో ఊహించుకోవాలి. బహుశా ఇలాంటి దమ్మున్న, ఇంత ధైర్యవంతమైన కాన్సెప్ట్‌ను చేస్తారని, చూస్తామని కూడా ఊహించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు.

‘యుఫోరియా’… సినిమా అనే కంటే ఓ పాఠం అని చెప్పొచ్చు. ఓ తల్లి తప్పు చేసిన తన బిడ్డకు నేర్పిన జీవిత పాఠమే ‘యుఫోరియా’. సినిమా మొదలు నుంచి చివరి వరకూ ఎక్కడా దర్శకుడు వెనక్కు చూడలేదు. చెప్పాలనుకున్న, చూపించాలనుకున్న, చర్చించాలనుకున్న ప్రతి అంశాన్నీ ఎక్కడా నెరవకుండా, ఇసుమంత కూడా సందేహించకుండా.. ఇంకా చెప్పాలంటే నిక్కచిగానే సినిమాలో పెట్టేసాడు. సింపుల్‌గా చెప్పాలంటే తప్పు చేయాలనుకున్న ఆలోచన వచ్చినోడు కూడా భయపడే దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తాయి.

Also Read : ప్రైవేట్ సైన్యం.. ఏ హీరో చేయని సాహసం..!

ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ సినిమాలో బాధిత ఆడకూతురు పాత్రలో సారా అర్జున్ ప్రాణం పెట్టి మరీ నటించారు. ఇలాంటి పాత్రను ధైర్యంతో చేయాలనుకున్న ఆమె నిర్ణయం దగ్గరే ముందు ఆమె గెలుపు మొదలైనట్టుగా సినీ విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ఉరుకులు, పరుగుల ప్రపంచంలో బిడ్డల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న తల్లితండ్రులను దర్శకుడు గుణ శేఖర్ కడిగి పారేశాడు. తల్లిగా భూమాత అంత భారంతో ఒకవైపు తన బిడ్డ పట్ల ప్రేమతో, మరోవైపు చదువుకున్న ఓ ఆడబిడ్డగా తన బాధ్యతను నిర్వహిస్తూ నడిచే పాత్రలో నటి భూమికా చావ్లా తన విశ్వ రూపాన్నే ఈ కథలో చూపించారు.

కథలో కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో గౌతమ్ మీనన్ ఎప్పటిలాగే చక్కగా ఒదిగిపోయి నటించారు. అసలు ఈ కథంతటికీ కారణమైన, దురలవాట్లకు అలవాటు పడ్డ ఓ కుర్రాడుగా వికాస్ పాత్రలో కొత్తబ్బాయి విఘ్నేష్ అయితే మాత్రం జీవించేశాడు. డ్రగ్స్ మనుషుల్లో ఉన్న మనిషిని ఎలా చంపేస్తాయో, తల్లికి, బిడ్డకు, చెల్లికి అనే తేడా తెలియకుండా వాళ్లెలా ప్రవర్తిస్తారో ఈ కుర్రాడి పాత్రతో చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశాడు దర్శకుడు గుణశేఖర్. కొత్త కుర్రాడు అయినా క్లైమాక్స్‌లో అతని నటనతో మెప్పించే ప్రతిభను కనబరిచాడు. చివర్లో లేచి నిలబడి చప్పట్లు కొట్టే స్థాయి క్లైమాక్స్‌తో ఈ కథకు వందకు వంద శాతం చేశాడు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమాను వీలైనంత ఎక్కువగా యువతరానికి చూపించాల్సిన అవసరం కూడా ఉందని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : స్పిరిట్ పుకార్లకు ప్రకాష్ రాజ్ చెక్..!

యుఫోరియా అనేది వాస్తవ పరిస్థితులకు అద్దం లాంటిదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. యువత, తల్లిదండ్రులు ఇద్దరూ తప్పక చూడాల్సిన క్లిష్టమైన సామాజిక సమస్యలను ప్రస్తావించే ప్రభావవంతమైన సినిమా అన్నారు. ఈ సినిమా దర్శకుడికి నా ప్రశంసలు.. అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “యూఫోరియా”.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పదవుల ఆరాటమే.. విమర్శలు...

2014 నుంచి 2019 వరకు ఏపీలో...

రాజ్యసభ సభ్యులుగా వాళ్లే...

ఏపీలో త్వరలో ఎన్నికల సందడి నెలకొననుంది....

మళ్లీ ఆ రోజే...

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల...

ఏకి పారేస్తున్న నేషనల్...

రాజకీయాలపై మీడియా ప్రభావం ఎక్కువ. ఛాన్స్...

ఆ మాట మాట్లాడవద్దు.....

ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల...

రూ.750 కోట్లు డిపాజిట్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో...

పోల్స్