Tuesday, June 23, 2026 07:18 AM
Tuesday, June 23, 2026 07:18 AM

బాబు-పవన్ భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సుమారు 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ముఖాముఖి సమావేశం ఇప్పుడు అటు రాజకీయ, ఇటు పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇద్దరు నాయకులు దాదాపు రెండు గంటల పాటు అనేక సున్నితమైన అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సమన్వయంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే పరిపాలనా పరమైన వివాదాల్లో కేవలం టీడీపీని మాత్రమే లాగుతుండటంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : తెలంగాణా సైనికులకు జనసేనాని బిగ్ షాక్..!

సంకీర్ణ ప్రభుత్వంలోని ఇద్దరు అగ్ర నాయకుల మధ్య ఏమి జరిగిందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇద్దరు నేతలు ప్రధానంగా తిరుమల నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జిషీట్ తర్వాత రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపైనే దృష్టి సారించినట్లు సమాచారం. వైసీపీ నేతలు సున్నితమైన అంశాలపై ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఇద్దరు నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ అంశంపై ఎన్డీఏ కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం తీసుకురావడం గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read : చంద్రబాబు సలహదారుగా మళ్లీ ఆయనే..!

అదే సమయంలో రాబోయే రాజ్యసభ ఎన్నికల గురించి కూడా చంద్రబాబుతో పవన్ చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో ఏపీ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు సీట్లలో జనసేన పార్టీకి ఒక సీటు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కోరినట్లు తెలుస్తోంది. జనసేన తరఫున లింగమనేని రమేశ్ లేదా పవన్ సోదరుడు చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేస్తారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. చిరంజీవిని ఎంపిక చేస్తే.. అటు సామాజిక పరంగా, ఇటు మెగా అభిమానుల అండ కూడా కూటమి సర్కార్‌కు ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, నామినేటెడ్ పదవుల కేటాయింపు, కీలక నియామకాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. సంకీర్ణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న తమ పార్టీ నాయకుల్లో కొంతమంది ప్రవర్తన పట్ల ఇద్దరు నాయకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

బ్రాండ్‌ ఏపీ ప్రమోషన్‌.....

మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు....

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

సాయి కృష్ణ కేసులో...

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో...

పవన్ కు ఆ...

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్...

పోల్స్