Wednesday, March 25, 2026 01:20 AM
Wednesday, March 25, 2026 01:20 AM

ఇండియన్స్ కు సింగపూర్ రెడ్ కార్పెట్..!

పర్యాటక ప్రదేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే భారతీయులు.. ఇప్పుడు సింగపూర్, ఇండోనేషియా, బాలీ వంటి ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తున్నారు. ఇందులో సింగపూర్ ముందు వరుసలో ఉన్న మాట వాస్తవం. 2025లో సింగపూర్ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. గత సంవత్సరం 1.2 మిలియన్లకు పైగా భారతీయులు సింగపూర్‌ ను సందర్శించారు. 2024 కంటే ఒక శాతం ఈ సంఖ్య పెరిగింది. 16.9 మిలియన్ల మంది గత ఏడాది ఆ దేశాన్ని సందర్శించారు. ఈవెంట్ లు ఎక్కువగా ఉండటం, తక్కువ దూరంలో ఉండటమే దీనికి కారణం.

Also Read : ప్రియాంక రిక్వస్ట్ తో మహేష్, రాజమౌళి షాక్ అయ్యారా..?

2025 మొదటి తొమ్మిది నెలల్లో భారీగా పర్యాటకులు వెళ్ళారు. దీని కారణంగా 23.9 బిలియన్ సింగపూర్ డాలర్లు అ దేశానికి ఆదాయం వచ్చింది. 2024 కంటే 6.5% పెరుగుదల కనపడిందని లెక్కలు చెప్తున్నాయి. భారతీయుల నుంచే 1.17 బిలియన్ డాలర్లు వచ్చాయి. భారత్-సింగపూర్ సంబంధాలకు గత ఏడాదిని మైలురాయిగా చెప్తున్నారు నిపుణులు. 2025 ఏడాదిలో భారత్ – సింగపూర్ మధ్య దౌత్య సంబంధాలకు 60 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. భారతీయులకు సింగపూర్ రెడ్ కార్పెట్ పరుస్తోంది.

Also Read : అమెరికా బిజినెస్ వీసా అప్లై చేసిన వారికి షాక్..!

సింగపూర్ టూరిజం బోర్డు ‘జస్ట్ బిట్వీన్ అస్ ఫ్రెండ్స్’ అంటూ గత ఏడాది ప్రచారం చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది. స్పెషల్ ఆఫర్స్ కూడా పర్యాటకుల సంఖ్య పెరగడానికి దోహద పడ్డాయి. విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు, షాపింగ్ గమ్యస్థానాలు అన్నీ కూడా పర్యాటకులను ఆకర్షించాయి. ఇక భారత ఉద్యోగులకు కూడా అక్కడ ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. సన్ ఫార్మా 2025లో సింగపూర్‌ కు 6,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకువెళ్ళింది. ఇప్పటి వరకు ఏ కంపెనీ అంత మందిని తీసుకుని వెళ్ళలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్