Wednesday, August 5, 2026 01:15 PM
Wednesday, August 5, 2026 01:15 PM

ఆ ప్లేయర్ ను ఆడుకుంటున్న గిల్ ఫ్యాన్స్

జాతీయ క్రికెట్ జట్టులో అవకాశం వస్తే.. పూర్తిగా కష్టపడాలి. ఒక మ్యాచ్ లో రాణించకపోయినా మరో మ్యాచ్ లో రాణించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఒత్తిడి ఉన్న ఆటగాళ్ళు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అయితే ఈ విషయంలో కేరళ ఆటగాడు సంజూ సామ్సన్ ఫెయిల్ అవుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. కివీస్ తో జరుగుతున్న 5 టి20 ల మ్యాచ్ లలో మూడు జరగగా.. మూడు మ్యాచ్ లలో ఒక్క దానిలో కూడా సంజూ ఆకట్టుకోలేదు. గిల్ స్థానంలో సంజుకు అవకాశం దక్కింది.

Also Read : పాక్ డ్రామాలకు ఐసీసీ చెక్.. ఓవర్ చేస్తే రిజల్ట్ అదే..!

శుభమన్ గిల్ ఓపెనర్ గా ఫెయిల్ కావడంతో సంజుకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. గతంలో ఓపెనర్ గా రాణించడంతో అతనికి పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తే రాణిస్తాడు అనే డిమాండ్ లు వినిపించాయి. కానీ నిరూపించుకునే విషయంలో మాత్రం సంజు ఫెయిల్ అయ్యాడు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ విషయంలో భారత జట్టు యాజమాన్యం అతనికి మద్దతుగా నిలవాలని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ లకు అతనిని పక్కన పెట్టాలని కోరుతున్నారు.

Also Read : ఆ విషయంలో విఫలమైన టీడీపీ, జనసేన..!

అభిషేక్ శర్మతో పాటుగా ఇషాన్ కిషన్ ను ఓపెనింగ్ కు పంపాలి అనే డిమాండ్ కూడా ఉంది. ఆ జోడిని ఒకసారి పరీక్షిస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. మరికొందరు అయితే గిల్, సూర్య కుమార్ యాదవ్ ఆడకపోయినా జట్టులో కొనసాగారు అని, అలాంటిది సంజూ సామ్సన్ ను ఎలా తప్పిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా టి20 వరల్డ్ కప్ కు ముందు సంజూ ఫాం కోల్పోవడం కొంత ఆందోళన కలిగించే విషయమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

పోల్స్