Wednesday, February 4, 2026 08:03 AM
Wednesday, February 4, 2026 08:03 AM

బ్రేకింగ్: విమాన ప్రమాదంలో డిప్యూటి సిఎం మృతి..!

రాజకీయ నాయకులను విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ప్రయాణం చేస్తున్న చార్టెడ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అంటూ డీజీసిఏ అధికారులు వెల్లడించారు. బారామతి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో అజిత్ పవార్ తో సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Also Read : వైసీపీపై ప్రజాగ్రహం.. లేదంటే బహిష్కరణే..!

ముంబై నుండి విమానం బయలుదేరిన గంట తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ర్యాలీలలో ప్రసంగించడానికి ఎన్‌సిపి చీఫ్ బారామతికి వెళ్లాల్సి ఉంది. బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ విమానం కుప్ప కూలినట్లుగా తెలుస్తోంది. అజిత్ పవార్ తో పాటుగా మరణించిన వారు ఎవరూ అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఏంటీ అనే దానిపై మాత్రం అధికారులు విచారణ వేగవంతం చేసారు.

Also Read : పాక్ డ్రామాలకు ఐసీసీ చెక్.. ఓవర్ చేస్తే రిజల్ట్ అదే..!

ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనే దానిపై బ్లాక్ బాక్స్ విచారణ ఆధారంగా బయటకు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో తప్పించుకునే అవకాశం లేకపోయిందని సమాచారం. శరద్ పవార్ రాజకీయ వారసుడిగా చెప్తున్న అజిత్ పవార్.. 2019 తర్వాత కీలక పరిణామాలతో ఎన్సిఏ శాసన సభా పక్షాన్ని వేరు చేసి.. పార్టీకి అధ్యక్షుడు అయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్