Sunday, March 22, 2026 10:28 AM
Sunday, March 22, 2026 10:28 AM

తెలంగాణ పుర పోరు షెడ్యూల్ ఇదే.. జనసేన ఓకే.. మరి సైకిల్..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దాదాపు నెలరోజుల నుంచి ఎన్నో ఊహాగానాలు నడుస్తున్న ఎన్నికలపై తాజాగా.. ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన తెలంగాణ ఎన్నికల సంఘం ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలపై దృష్టి సారించింది. అటు రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలపై దాదాపు మూడు నెలల నుంచి కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. దీనితో సామాన్య ప్రజలు ఎన్నికలపై ఉత్కంఠ పెరిగింది.

Also Read : మొదటి దెయ్యం ఆయనే.. కవిత మరో సెన్సేషన్..!

ఇటీవల రిజర్వేషన్లను కూడా ఖరారు చేసిన నేపథ్యంలో.. షెడ్యూల్ కోసం అందరూ ఎదురు చూస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ ఎన్నికల కమిషన్.. షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 52.43 లక్షలమంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల అధికారి ప్రకటన చేశారు.

Also Read : మెగాస్టార్‌తో ఢీ అంటున్న సింగర్

ఇక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నదా లేదా అనేదానిపై స్పష్టత రావటం లేదు. తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని జనసేన పార్టీ ఇటీవల ప్రకటన కూడా చేసింది. మరి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై ఆ పార్టీ పెద్దలు ఇవ్వలేదు. అటు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడేందుకు కొంత ఇబ్బంది పడుతోంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. దీనితో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం బిజెపి పెద్దలను ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో తెలంగాణలో ఏపీ ఫార్ములా అమలు చేస్తారా లేదా అనేది స్పష్టత రావటం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్