Sunday, March 22, 2026 02:59 PM
Sunday, March 22, 2026 02:59 PM

యూరప్ తో ఒప్పందం.. అమెరికా ఆగ్రహం..!

సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్న నేపధ్యంలో.. భారత ఉత్పత్తులకు గమ్యస్థానంగా యూరప్ దేశాలను ఎంచుకుని అడుగులు వేస్తోంది భారత్. తాజాగా యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ సెట్ చేసుకుంది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేసారు. ఒప్పందాలకు తల్లిగా ఈ డీల్ ను అభివర్ణించారు ట్రంప్. ఇదిలా ఉంచితే ఈ సమావేశంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై సీరియస్ గా ఉంది అమెరికా.

Also Read : వైఎస్ అవినాష్‌కు ఎందుకంత ధీమా..?

అందుకే సుంకాలు విధించగా.. తాజాగా యూరోపియన్ యూనియన్ ఒప్పందాన్ని భారత్ గ్రాండ్ గా ప్రకటించడంతో రగిలిపోతుంది అమెరికా. యూరప్ తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసినందుకు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఏబీసీ న్యూస్‌ తో మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని ముగించడానికి అమెరికా యూరోపియన్ల కంటే చాలా ఎక్కువ త్యాగం చేసిందని బెస్సెంట్ వ్యాఖ్యానించారు. రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకున్నందుకు భారత్ పై తాము విధించిన శిక్షాత్మక సుంకాలను సమర్ధించారు.

Also Read : డైట్ కంటే టైం ముఖ్యమా..? డాక్టర్ సంచలన విషయాలు..!

రష్యన్ చమురును కొనుగోలు చేసినందుకు భారత్ పై 25% సుంకాలు విధించామని.. ఈ వారం ఏం జరిగిందో చూడండి.. యూరోపియన్లు భారత్ తో వాణిజ్య ఒప్పందం చేసారని, ఇక అంతకు ముందు రష్యా నుంచి వచ్చిన ముడి చమురును అమ్ముకుని భారత్ బాగుపడింది అంటూ కామెంట్ చేసారు. ఇదిలా ఉంచితే భారత రైతులు, వస్త్ర ఎగుమతి దారులు ఇప్పటికే యూరప్ వ్యాపారులపై దృష్టి సారించి, అమెరికా మార్కెట్ ను దాదాపుగా పక్కన పెడుతూ వస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్