Sunday, June 21, 2026 07:42 AM
Sunday, June 21, 2026 07:42 AM

హెచ్ 1 బీ వీసాలకు రెండేళ్ళు ఆగాల్సిందేనా..?

అమెరికా వెళ్ళడానికి విద్యార్ధులు, ఉద్యోగులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వంద మంది ప్రయత్నం చేస్తే 10 మంది వెళ్తే గొప్ప. ఇక ఇప్పుడు ఆ పది మందికి కూడా వాతావరణం కష్టంగానే ఉంటుంది. వీసాలే కాదు వీసా ఇంటర్వ్యూల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో అడుగుపెట్టడం అంత ఈజీ కాదనేది అర్ధమవుతోంది. స్టూడెంట్, హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికా సర్కార్ అనుసరిస్తోన్న వైఖరితో భారత్ సహా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి.

Also Read : యూకే, అమెరికా వెళ్ళే వారికి కష్టమే..?

తాజాగా వచ్చిన వార్తతో ఇప్పుడు మరో కలవరం మొదలైంది. భారత్ వ్యాప్తంగా అమెరికా కాన్సులేట్ ల్లో హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. నిన్న వచ్చిన సమాచారం ప్రకారం.. హెచ్ 1 బీ వీసాలకు వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే అనే ప్రకటన కలవరపెడితే.. ఇప్పుడు నిపుణుల అంచనాల ప్రకారం 2028 చివరి వరకు ఇంటర్వ్యూలు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ నిపుణుల అంచనాల ప్రకారం.. ప్రముఖ కంపెనీలు అమెరికా ఉద్యోగులను నియమించుకునే విధంగా కొన్ని రూల్స్ ప్రభుత్వం మారుస్తోంది.

Also Read : ఇదేం కొట్టుడు.. టి20 వరల్డ్ కప్ లో భారత్ మిస్సైల్ అతనే..!

దీనితో హెచ్ 1 బీలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అంశంలో సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోందని చెప్తున్నారు. ఇక గత ఏడాది డిసెంబర్ లో ఇంటర్వ్యూలు ఉంటాయని భావించారు. కానీ ఆ తర్వాత.. ఈ ఏడాది మార్చ్ కు మార్చారు. ఆ తర్వాత అక్టోబర్ కు ఇప్పుడు 2027 అంటూ ప్రకటనలు వచ్చాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2028 చివరి నాటికి ఈ ప్రతిష్టంభన ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. 2027 వరకు దాదాపుగా రెగ్యులర్ అపాయింట్‌మెంట్‌ లు లేకపోవడమే కాకుండా అమెరికాలో ఉన్న వారి సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్ కూడా గట్టిగానే జరుగుతోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్